కోహ్లీ తప్పిదానికి పరుగు కోత విధించిన ఫీల్డ్ అంపైర్(వీడియో)

హైదరాబాద్: వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించి 150కి పైగా స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికైయ్యాడు. అయితే కోహ్లి.. మ్యాచ్ మధ్యలో ఓ చిన్న తప్పిదం చేశాడు. దీంతో.. రెండు పరుగులు చేసినా.. అంపైర్ ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంతో తన తప్పుని గ్రహించిన కోహ్లి.. మైదానంలో కొన్ని క్షణాలు అసహనానికి గురై గట్టిగా అరిచాడు.
లైన్‌కి వెలుపలగా బ్యాట్‌ని పెట్టి రెండో పరుగుకి
ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన స్పిన్నర్ నర్స్ బౌలింగ్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసిన విరాట్ కోహ్లి.. అంబటి రాయుడితో కలిసి వికెట్ల మధ్య రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే.. బంతిని చూస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజు లోపలికి బ్యాట్ పెట్టకుండా.. లైన్‌కి వెలుపలగా బ్యాట్‌ని పెట్టి రెండో పరుగుకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన ఫీల్డ్ అంపైర్.. ఒక పరుగు కోత విధించాడు. అప్పటికి విరాట్ కోహ్లి స్కోరు 20 బంతుల్లో 13కాగా.. భారత్ 10 ఓవర్లలో 49/2తో ఉంది.

షై హోప్ సెంచరీ సాధించడంతో.. మ్యాచ్ టైగా
మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.

అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని
24వ ఓవర్‌లో ఒబెద్ మెకాయ్ వేసిన బంతికి సింగిల్ సాధించడం ద్వారా కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా కెప్టెన్‌కు విశాఖలో ఇది 3వ హాఫ్ సెంచరీ. ఫలితంగా సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని
విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications