For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో ఢీకి కొత్త అవతారంలో విరాట్ కోహ్లీ

By Pratap

మెల్‌బోర్న్‌: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కొత్త అవతారం ఎత్తాడు. హెయిర్ స్టయిల్ మార్చుకోవడం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బాగా అలవాటు. భారత క్రికెటర్లు ఒక్కో మ్యాచుకు ఒక్కొక్కరు కొత్తగా కనిపించేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

ఇంతకు ముందు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మొహక్ హెయిర్ స్టయిల్‌తో కనిపించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే మ్యాచులో విరాట్ కొహ్లీ కొత్త హెయిర్ స్టయిల్‌తో కనిపించనున్నాడు. గురువారంనాడు అందుకు అతను ప్రత్యేకంగా సమయం కేటాయించాడు.

Virat kohli changes hair style

హోటల్ గది నుంచి బయటకు వచ్చి మెల్‌బోర్న్ వీధుల్లో కొద్ది దూరం నడిచి వెళ్లాడు. ఆ తర్వాత నగరంలోని ప్రఖ్యాత టోనీ అండ్ గై సెలూన్‌కు చేరుకున్నాడు. కొన్ని గంటల తర్వాత అతను కొత్త లుక్‌తో బయటకు వచ్చాడు. తలకు రెండు వైపులా జుట్టును తీయించినట్లు ఉండి, మధ్యలో దువ్వినట్లుగా ఉండే లుక్‌తో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చాడు.

ఇటీవల ప్రఖ్యాత ఫుట్‌బాలర్ క్రిస్టియానా రోనాల్డో కనిపిస్తున్న సిఆర్7 స్టయిల్ లుక్‌ను విరాట్ కోహ్లీ హెయిర్ స్టయిల్ తలపిస్తోంది. కోహ్లీ కొత్త అవతారం అందరినీ ఆశ్చర్యపరుస్తుందనడంలో సందేహం లేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+