Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఛాంపియన్స్ రింగ్‌తో విరాట్ కోహ్లీ.. జాన్ సీన్ స్టైల్‌లో సెలబ్రేషన్స్!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా వాంఖడే స్డేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌కు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విడుదల చేసిన ఓ వీడియో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన రింగ్‌ను ధరించి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా స్టైల్ లో గెస్చర్ ఇచ్చాడు. యూ కాంట్ సీ మీ అంటూ విరాట్ కోహ్లీ వేడుకలు చేశాడు. విరాట్ కోహ్లీ వీడియోను షేర్ చేస్తూ "విరాట్ కోహ్లీ వైబ్స్" అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ పోస్ట్ లో పేర్కొంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ ధరించిన రింగ్ ఏంటీ అని నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన అనంతరం భారత ప్లేయర్లకూ బీసీసీఐ ఈ స్పెషల్ డైమండ్ రింగ్ ను బహూకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన నమన్ అవార్డుల కార్యక్రమంలో ఈ 'ఛాంపియన్స్ రింగ్'లను అందించారు. బంగారంతో తయారై వజ్రాలతో అద్భుతంగా అలంకరించబడిన ఈ ఉంగరం బరుపు సుమారు 60 గ్రాములుగా ఉంది. ఇందులో దాదాపు 300 డైమండ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఉంగరం అశోక చక్రం డిజైన్ తో మరింత ప్రత్యేకతను సంతకరించుకుంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కి ముందు ఈ రింగ్ ను విరాట్ కోహ్లీ ధరించి వాంఖడేలో స్పెషల్ ఇన్నింగ్స్ లోడింగ్స్ అని సందేశం ఇచ్చినట్లయింది. ఈ ప్రత్యేక రింగ్ ద్వారా దేశ గర్వాన్ని మళ్లీ గుర్తు చేసిన కింగ్ కోహ్లీ.. అభిమానుల్లో ఊపును పెంచేశాడు.

Virat Kohli Celebrates with Champions Ring in John Cena Style at IPL 2025

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల అంచనా

ముంబై ఇండియన్స్(ప్లేయింగ్ 11 అంచనా): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, రాజ్ బావా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, రాజ్ బావా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ప్లేయింగ్ 11 అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ , యశ్ దయాల్.

Story first published: Monday, April 7, 2025, 17:29 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+