బంగ్లాదేశ్ క్రికెటర్లు కోహ్లీ వద్దకు వచ్చి ఏం చేశారో తెలుసా?
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సేన 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం బంగ్లాదేశ్ యువ క్రికెటర్లు కోహ్లీని కలిసేందుకు ఆసక్తిని కనబర్చారు.

బంగ్లాదేశ్ కోచ్‌తో సహా పలువురు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి ఫొటోలు దిగారు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. టీ షట్స్‌పై సంతకాలు చేయించుకున్నారు. కొంత సమయం కోహ్లీతో గడిపారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు సూచనలు కోహ్లీ చేశాడు.
ఇలా భారత్ పర్యటనకు వచ్చిన ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు కోహ్లీని కలవడం గతంలో కూడా మనం చూశాం. ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ యువ ఆటగాడు హసీబ్ హమీద్.. కోహ్లీని కలిశాడు. తనకు బ్యాటింగ్‌లో పలు సూచనలివ్వమని కోరాడు.
ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు బ్యాటింగ్ గురించి చర్చించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. తాజాగా ఇప్పుడు బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు కోహ్లీని కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 19 వరుస టెస్ట్ విజయాలు, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన, పలు రికార్డులు బద్దలు కొట్టడంతో కోహ్లీ అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications