
రిస్క్‌లో కోహ్లీ కెప్టెన్సీ..
అయితే ఈ టెస్ట్ సిరీస్ ఓటమి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తును రిస్క్‌లో పడేసింది. వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పెద్దలతో గొడవపడ్డ కోహ్లీకి కష్టాలు తప్పేలా లేవు.
ఈ పర్యటనకు ముందే ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ కోహ్లీ కెరీర్‌కు లిట్మస్ టెస్ట్ లాంటిదని క్రికెట్ ఎక్స్పెర్ట్స్ కామెంట్ చేశారు. ఈ ఓటమికి తోడు మైదానంలో అతను ప్రవర్తించిన తీరు మరింత ఎఫెక్ట్ చేయనుంది. థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీ విషయంలో డీఆర్ఎస్ తప్పిదం ఉన్నప్పటికీ.. దానిపై కోహ్లీ చేసిన రచ్చపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
IND vs SA: టీమిండియా కొంపముంచిన నాలుగు తప్పిదాలు!

నోటి దురద..
టెక్నాలజీలో తప్పొప్పులు సహజమే. కానీ, కెప్టెన్ కోహ్లీ స్టంప్ మైక్ దగ్గరికొచ్చి మరీ బ్రాడ్‌కాస్టర్‌ను తిట్టడం చూస్తే తను చాలా ప్రెజర్లో ఉన్నాడని అర్థమైంది. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ సైతం కెప్టెన్ రూట్లోనే నడిచారు. ప్రపంచం మొత్తం తమ జట్టుకు వ్యతిరేకంగా ఉందని రాహుల్ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఫోర్త్డే మార్నింగ్ డుసెన్, పీటర్సన్‌ను మనోళ్లు స్లెడ్జ్ చేశారు.
బ్యాట్‌తో కొట్టలేని వాళ్లు నోటికి పనిచెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. కెప్టెన్ కోహ్లీనే ఇలా చేస్తే.. యువ ఆటగాళ్లు ఎలా అర్థం చేసుకుంటారని, వారికి ఇచ్చే మెసేజ్ ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పుజారా, రహానేలను వెనుకేసుకురావడం..
ఇక కోహ్లీ బిహేవియర్‌పై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే కెప్టెన్సీ వ్యవహారంలో కోహ్లీ చేసిన రచ్చపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బోర్డు పెద్దలు.. ఈ కారణం చూపి అతనిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను కోహ్లీ పదే పదే వెనుకేసుకురావడంపై కూడా కోచ్ ద్రవిడ్‌తో సహా బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రాణించడం అతనికి కలిసొచ్చే అంశం. సారథ్యం విషయంలో కోహ్లీ ఎక్కడా తప్పు చేయలేదు. బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించాడు. వన్డే సిరీస్‌లో మెరిస్తే అతనికి తిరుగుండదు లేకుంటే.. జట్టులో చోటే కోల్పోయే ప్రమాదం ఉంది.
IPL 2022: బిగ్‌న్యూస్.. సీఎస్కే కెప్టెన్సీకి ఎంఎస్ ధోనీ గుడ్‌బై!

వాళ్లు అర్థం చేసుకోలేరు..
డీన్ ఎల్గర్ రివ్యూ వ్యవహారంలో విమర్శలు వస్తున్నా.. తమ ప్రవర్తనను భారత కెప్టెన్ కోహ్లీ సమర్థించుకున్నాడు. బయట ఉన్న వాళ్లు తాము అలా ఎందుకు స్పందించామో అర్థం చేసుకోలేరని అన్నాడు. 'ఆ విషయానికి సంబంధించి నేను ఇంకేమీ మాట్లాడాలనుకోవట్లేదు. మైదానంలో ఏం జరుగుతుందో మాకే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది బయటి వాళ్లకు సరిగ్గా తెలియదు'' అని కోహ్లీ చెప్పాడు. ఇక మూడు వన్డేల సిరీస్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. కోహ్లీ కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగనున్నాడు.