WTC Final: విరాట్ కోహ్లీపై కోపంతో న్యూజిలాండ్‌ గెలవాలంటున్న రోహిత్ ఫ్యాన్స్!

WTC Final: Kohli పై కోపంతో NZ గెలవాలని.. Rohit కి అవమానం, Kane కోసం SRH ఫ్యాన్స్ ? | Oneindia Telugu

హైదరాబాద్: అభిమానం హద్దులు దాటుతోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరి ఎక్కువైంది. ముఖ్యంగా కొంత మంది అభిమానులు తమకు నచ్చనివారిపై పనిగట్టుకొని విమర్శలకు దిగుతున్నారు. ఇన్నాళ్లు ఈ సంస్కృతి సినీ, రాజకీయ రంగాలకే పరిమితమవ్వగా.. తాజాగా క్రీడలకు కూడా వ్యాపించింది. భారత్‌లో దైవంగా భావించే క్రికెట్‌కు కూడా ఈ పిచ్చి అభిమానం అంటుకుంది. గత కొన్నాళ్లుగా ఇది శృతిమించింది. సోషల్ మీడియా వేదికగానే కాకుండా.. చివరకు తమ అభిమాన క్రికెటర్ల కోసం కొట్టుకునేవరకు వెళ్లింది. ఈ తరహా ఘటనలను క్రికెటర్లు ఖండించినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై జరుగుతున్న ట్రోలింగ్ విస్మయానికి గురిచేస్తోంది.

న్యూజిలాండ్ గెలవాలా?

న్యూజిలాండ్ గెలవాలా?

విరాట్ కోహ్లీపై ఉన్న కోపంతో కొంత మంది అభిమానులు డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంత మంది ఫ్యాన్స్ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అంటే తమకు నచ్చదని, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోరుతున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఎన్నటికీ ఐసీసీ టైటిల్ గెలవదని, టీమ్ కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ కోసమైనా న్యూజిలాండే గెలవాలని కోరుకుంటున్నారు. కోహ్లీ ఆధిపత్యం తగ్గడానికైనా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడాలని కొరుకుంటున్నారు. అయితే దీనికి విరాట్ ఫ్యాన్స్ బదులిస్తుండటంతో సోషల్ మీడియా డబ్ల్యూటీసీ రచ్చ నడుస్తోంది.

కేన్‌మామకు ప్రేమతో..

కేన్‌మామకు ప్రేమతో..

ఇక మరికొంతమంది విచిత్రంగా కేన్ విలియమ్సన్‌పై ప్రేమతో న్యూజిలాండ్ గెలవాలనుకుంటున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంత మంది ఫ్యాన్స్ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. మన హైదరాబాద్ కెప్టెన్ కేన్‌మామ అని, అతను గెలిస్తే మనం గెలిచినట్లేనంటున్నారు. అంతేకాకుండా ప్రతీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓడిపోతుందని, ఈ సారైన ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. టీమిండియా కంటే న్యూజిలాండ్ బలంగా ఉందని, ఇంగ్లండ్ పరిస్థితులు న్యూజిలాండ్ కలిసొస్తాయి కాబట్టి కేన్ మామదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 వాటీజ్ దిస్..

వాటీజ్ దిస్..

సోషల్ మీడియా వేదికగా అభిమానుల తీరుని చూసి క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు విస్మయపోతున్నారు. వాటీజ్ దిస్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ భారతీయుడిగా మన దేశం గెలవాలని కోరుకోవాలి, కానీ ఇతర దేశాలు గెలవాలనుకోవడం ఏందని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చినా పర్వాలేదని, కానీ దేశం తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు ఇలాంటి ప్రవర్తన ఏందని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్నా.. గెలిచినా మన మద్దతు మనదేశానికే ఉండాలని చెబుతున్నారు. నిజమైన క్రికెట్ ప్రేమికులు ఇలా ఉండరని విమర్శిస్తున్నారు.

 రోహిత్ ఫ్యాన్స్ కూడా..

రోహిత్ ఫ్యాన్స్ కూడా..

ఇక అసలు సిసలు రోహిత్ ఫ్యాన్స్ కూడా ఈ తరహా ట్రోలింగ్‌ను ఖండిస్తున్నారు. మన దేశం ఓడిపోవాలనుకోవడం తమ అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మను అవమానపరిచినట్లేనని, ఈ తరహా ట్రోలింగ్‌కు దిగవద్దని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ టీమ్‌మెట్స్ అని, ఇద్దరు బాగా ఆడాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోహ్లీపై కోపంతో భారత్ ఓడిపోవాలనుకోవడం బాగుండదంటున్నారు. కోహ్లీ నచ్చకుంటే రోహిత్ శర్మ బాగా ఆడాలని పోస్ట్ పెట్టండని, కానీ భారత జట్టును కించపర్చేలా పోస్ట్‌లు చేయవద్దని రోహిత్ ఫ్యాన్స్ గ్రూప్స్, అభిమానులను కోరుతున్నారు. ఏదీ ఏమైనా.. సొంత దేశం ఓడాలనుకోవడం బాలేదని కామెంట్ చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 17, 2021, 10:53 [IST]
Other articles published on Jun 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X