కెప్టెన్‌గా బ్రాడ్‌మన్, పాంటింగ్ రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-2తో నిలిచింది. మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలుపుకుని 200కి పైగా పరుగులు సాధించిన కోహ్లీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు
జట్టు విజయం కోసం 200పైగా పరుగులు అత్యధికసార్లు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 200కు పైగా పరుగులు సాధించిన ఏడు సందర్భాల్లో భారత జట్టు విజయం సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్‌ల పేరిట ఉండేది.

కెప్టెన్లుగా ఆరుసార్లు సాధించిన బ్రాడ్‌మన్, పాంటింగ్
వీరిద్దరూ ఈ ఘనతను కెప్టెన్లుగా ఆరుసార్లు సాధించారు. ఇక, భారత కెప్టెన్లలో చూస్తే జట్టు గెలుపు కోసం ధోనీ 200పైగా పరుగులను ఒక్కసారి సాధించాడు. 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన టెస్టులో ధోనీ 224 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

200కు పైగా పరుగులు సాధించడం ఇది పదోసారి
అయితే కోహ్లీ కెప్టెన్‌గా ఒక టెస్టులో 200కు పైగా పరుగులు సాధించడం ఇది పదోసారి. భారత కెప్టెన్‌గా ఇది కూడా ఒక రికార్డే కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ ఇన్నిసార్లు టెస్టుల్లో 200కు పైగా పరుగులు సాధించలేదు. మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా అనేక రికార్డులను సొంతం చేసుకుంది.

ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో భారత రికార్డులు:
* భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు (22) సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో గంగూలీ (21)ని అధిగమించాడు. ఈ జాబితాలో ధోని (27) విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
* ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో భారత్‌కు ఇది రెండో విజయం. 2007లోనూ ఓసారి గెలిచింది.
* ఇంగ్లండ్‌పై భారత్‌కు పరుగుల పరం (203)గా ఇది మూడో అతిపెద్ద భారీ విజయం.
* ఈ టెస్టు మ్యాచ్‌లో భారత పేసర్లు తీసిన వికెట్ల సంఖ్య 19. ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై అత్యధికంగా 20 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications