Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ 120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు: పాక్ మాజీ పేసర్

Virat Kohli can hit 120 centuries says Shoaib Akhtar

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కృత నిశ్చయంతో ఆడుతున్నాడని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లీ ఇలానే ఆడితే.. 120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. 2019 ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే బాగుండేదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.

120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు:

120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు:

ఆదివారం హలో లైవ్‌లో మాట్లాడిన షోయబ్ అక్తర్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 'మోడ్రన్ డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజ క్రికెటర్లను మళ్లీ చూడలేం. దీంతో పాటు క్రికెట్ నాణ్యత కూడా బాగా తగ్గింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడు. ప్రస్తుతం కోహ్లీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. 120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. అతడు కృతనిశ్చయంతో ఆడుతున్నాడు' అని అక్తర్ అన్నాడు.

అలాంటి విషయాలకు దూరం:

అలాంటి విషయాలకు దూరం:

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌‌తో చోటు చేసుకున్న వివాదంపై (బాప్ బాప్ హోతా హై, బీటా బీటా హోతా హై) కూడా అక్తర్ స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్తగా మాట్లాడొద్దని, ఈరోజు ఫాదర్స్ డే అని, కిడ్‌గా నీ గురించి మేము కేర్ తీసుకుంటామని సెహ్వాగ్‌తో అన్నానని అక్తర్ చెప్పాడు. సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఇద్దరూ మంచి వ్యక్తులని పాక్ పేసర్ తెలిపాడు. కానీ.. వారు టీవీలో తమ నోటికి పనిచెప్తారని.. తాను కూడా వారిపై చెడు మాటలు చెప్పగలనన్నాడు. అయితే తాను అలాంటి విషయాలకు దూరంగా ఉంటానని అక్తర్ తెలిపాడు. ఎందుకంటే.. చిన్న పిల్లలు టీవీ షోలు చూస్తారన్నాడు.

 షారుఖ్ నాకు అన్నయ్య:

షారుఖ్ నాకు అన్నయ్య:

'నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నా. అతను ఏ మతానికి చెందినవాడు అనే విషయాన్ని పట్టించుకోను. సహజంగా నేను సున్నితంగా ఉంటా కానీ.. మైదానంలో ఒక బౌలర్‌గా మాత్రం దూకుడుగా ప్రవర్తిస్తా. షారుఖ్ ఖాన్ అభిమానులను చూసి ప్రేమించడం నేర్చుకున్నా. షారుఖ్ తన అభిమానులను నిత్యం కలుసుకుంటాడు. ఆ సమయంలో ఫాన్స్ చాలా సంతోషిస్తారు. షారుఖ్ నాకు అన్నయ్య లాంటివాడు. అలాగే అమీర్ ఖాన్ కూడా' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించాలి:

సల్మాన్ ఖాన్ హీరోగా నటించాలి:

ఒకవేళ తనపై బయోపిక్ రూపొందితే.. అందులో ప్రధాన పాత్రలో ఎవరు నటించాలనే విషయాన్ని షోయబ్ అక్తర్ తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ 'సల్మాన్ ఖాన్' తన బయోపిక్‌లో హీరోగా నటించాలని కోరుకుంటున్నట్లు అక్తర్ తెలిపాడు. అదే తన చివరి కోరిక అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు ఇప్పటికీ అక్తర్ పేరిటే ఉంది. అభిమానులు అతన్ని ముద్దుగా 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలుచుకుంటారు.

Story first published: Monday, May 11, 2020, 13:08 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+