Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : సూపర్ ఫామ్‌లో కోహ్లీ.. ఆసీస్‌పై ఈ రికార్డులు బద్దలు కొట్టేస్తాడా?

Virat Kohli can break these records in ODI Series

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో రాణించాడు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ కోసం కూడా రెడీ అవుతున్నాడు. ఈ సిరీస్‌లో కొన్ని మైలు రాళ్లు అందుకునే అవకాశం కోహ్లీ ముందు ఉంది. అవేంటో ఒకసారి చూస్తే..

 అత్యధిక అవార్డులు..

అత్యధిక అవార్డులు..

అహ్మదాబాద్ టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న కోహ్లీ.. వన్డే సిరీస్‌లో కూడా చెలరేగుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే జరిగి ఒక్క మ్యాచ్‌లో అయినా కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కితే.. అతను అరుదైన ఘనత సాధించినట్లే. ఆసీస్‌పై అత్యధికంగా ఈ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరతాడు. అహ్మదాబాద్ టెస్టులో అందుకున్న అవార్డు ఆసీస్‌పై కోహ్లీకి తొమ్మిదో అవార్డు. మరొక్క అవార్డు అందుకుంటే వివ్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్‌తో సమానంగా పది 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులతో జాయింట్ సెకండ్ ర్యాంక్ అందుకుంటాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్.. ఆసీస్‌పై ఏకంగా 17 అవార్డులు అందుకోవడం గమనార్హం.

కంగారూలపై వీర విహారం..

కంగారూలపై వీర విహారం..

ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై విరుచుకుపడే బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కంగారూలతో ఎప్పుడు ఆడినా కూడా తనలోని క్లాస్ చూపిస్తూ ఆకట్టుకోవడం కోహ్లీకి అలవాటు. ఇదే జరిగి మూడు వన్డేల్లో మరొక్క సెంచరీ చేసినా సరే ఆసీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అహ్మదాబాద్ టెస్టులో చేసిన సెంచరీ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 75వది. వీటిలో 16 సెంచరీలు ఆసీస్‌పై చేసినవే. ఇక వన్డేల వరకే తీసుకుంటే.. కంగారూలపై కోహ్లీ 8 సెంచరీలు చేశాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క సెంచరీ చేసినా కూడా.. ఆసీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఈ సిరీస్‌లోనే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించినా ఆశ్చర్యం లేదు.

పరుగుల వరద..

పరుగుల వరద..

కోహ్లీ కనుక ఫామ్‌లో ఉంటే అతని బ్యాటు నుంచి పరుగులు ఎంత ధారాళంగా వస్తాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఫేజ్‌లో ఉన్న కోహ్లీ.. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మరో మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 262 వన్డే ఇన్నింగ్సుల్లో 12809 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కనుక 191 పరుగులు చేస్తే.. 13 వేల పరుగుల రికార్డును కూడా అందుకుంటాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఈ రికార్డు అందుకున్న ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.

Story first published: Thursday, March 16, 2023, 14:48 [IST]
Other articles published on Mar 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+