'సచిన్ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమిస్తాడు'


హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పక అధిగమిస్తాడని భారత అండర్-19 జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ మునీశ్ బాలి పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బాలి మాట్లాడుతూ సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుగొడతాడని జోస్యం చెప్పాడు.

కోహ్లీ ఏదో ఒకరోజు
విరాట్ కోహ్లీ ఏదో ఒకరోజు భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని తాను ఆనాడే ఊహించినని చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ కచ్చితంగా ఉంటాడని, అతడి ఫిట్‌నెస్ నిజంగా అద్భుతమని చెప్పాడు. భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని కోహ్లీ పూర్తిగా మార్చేశాడని అన్నాడు. కెరీర్ ఆరంభం నుంచీ కోహ్లీ పరుగుల దాహంతో ఉండేవాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ప్రపంచ క్రికెట్‌ను మరో స్థాయికి
ప్రపంచ క్రికెట్‌ను అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించాడు. రెండు చేతులతోనూ కోహ్లీ అవకాశాలను అందిపుచ్చుకున్నాడని బాలి అన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు కోహ్లీ తనను తాను మార్చుకునేవాడనని తెలిపాడు. క్రికెట్‌లో అతి తక్కువ సమయంలోనే కోహ్లీ లెజెండ్‌గా మారాడని కొనియాడాడు.

ఆటపై అతడికున్న ఆరాధనా భావమే
ఆటపై అతడికున్న ఆరాధనా భావమే అతడిని ఈ స్థాయికి చేర్చిందని చెప్పుకొచ్చాడు. 2008లో బాలి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అండర్-19 జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌ను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నెగ్గిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications