INDvsBAN: కోహ్లీ ముందు బంపరాఫర్.. ఆ రికార్డు కూడా సాధిస్తాడా..?

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మళ్లీ గాడిన పడినట్లే కనిపిస్తున్నాడు. మూడేళ్ల పాటు అంతర్జాతీయ శతకం కోసం అభిమానులు ఎదురు చూసేలా చేసిన ఈ మోడర్న్ గ్రేట్.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆసియా కప్‌లో ఆ కరువు తీర్చాడు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. దీంతో కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు కోహ్లీ ముందు మరో అరుదైన రికార్డు ఎదురు చూస్తోంది.

లేటైనా లేటెస్ట్‌గా..
టీ20 వరల్డ్ కప్ ఉన్నందున ఆసియా కప్‌ను కూడా ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు. ఈ ఫార్మాట్‌లో తన 71వ శతకం రావడంపై కోహ్లీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో మైదానం నలువైపులా సూపర్ షాట్‌లు ఆడిన కోహ్లీ.. 200 స్ట్రైక్ రేటుతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వరల్డ్ కప్‌లో కూడా అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా ఇంటి దారి పట్టింది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లలేదు. మళ్లీ బంగ్లా పర్యటనలో మైదానంలో దిగాడు.

వన్డేల్లో కూడా తీరిన దాహం..
బంగ్లాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో కోహ్లీ రాణించలేదు. తొలి వన్డేలో లిటాన్ దాస్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చి సింగిల్ డిజిట్ స్కోరుకే మైదానం వీడాడు. అయితే మూడో వన్డేలో తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో క్రీజులోకి వచ్చి అదరగొట్టాడు. తన 72వ శతకం నమోదు చేశాడు. ఈ సెంచరీ చేయగానే కోహ్లీ అన్న మాటలే అతను వన్డే శతకం కోసం ఎంతగా వేచి చూసింది అందరికి చెప్పేస్తాయి. దీంతో మూడేళ్లుగా కోహ్లీ శతకం కోసం ఎదురు చూసిన అభిమానుల ఆనందం రెట్టింపయింది.

కోహ్లీ కిరీటంలో మరో కలికితురాయి..
కోహ్లీ తిరిగి ఫామ్ అందుకున్న తర్వాత ఆడుతున్న తొలి టెస్టు బంగ్లాదేశ్‌తోనే. ఇక్కడ అతను రెండు టెస్టుల్లో ఆడతాడు. ఈ టెస్టు మ్యాచుల్లో కూడా కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అదే జరిగితే కోహ్లీ కిరీటంలో మరో వజ్రం చేరినట్లే. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలో ఒకే ఏడాదిలో సెంచరీ చేసిన అతికొద్ది బ్యాటర్ల జాబితాలో కోహ్లీ కూడా చేరతాడు. కోహ్లీ కనుక బంగ్లాపై సెంచరీ చేస్తే ఈ రికార్డు నెలకొల్పిన బ్యాటర్‌లలో ఒకడిగా రికార్డు సృష్టిస్తాడు. మరి బంగ్లాపై కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications