కోహ్లీకి ఛాలెంజ్ విసిరిన యూట్యూబర్
ప్రపంచవ్యాప్తంగా ఐషోస్పీడ్(IShowSpeed)గా పాపులర్ అయిన ఇంటర్నెట్ సెన్సేషన్ డారెన్ జాసన్ తాజాగా క్రికెట్ పిచ్‌పై తనదైన శైలిలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కరేబియన్ దీవుల్లో తీసిన ఒక వైరల్ వీడియోలో స్పీడ్ చాలా విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో వికెట్ తీయడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి స్పీడ్ వేసిన బాల్ క్రికెట్ రూల్స్ కు అనుగుణంగా లేకపోయినప్పటికీ అతను నేరుగా స్టంప్‌లను పడగొట్టిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ అభిమానులను అలరించే స్పీడ్, ఈసారి క్రికెట్ పిచ్‌పై కూడా తన మార్క్ చూపించాడు.
ఈ వికెట్ తీసిన ఉత్సాహంలో స్పీడ్ ఏకంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకే సవాల్ విసిరాడు. "కోహ్లీ, నాకు కాల్ చేయి..ఐసీసీ..ముంబై క్రికెట్ టీమ్.. బ్రో, నువ్వు నాకు ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే" అంటూ కేకలు వేస్తూ సందడి చేశాడు. కోహ్లీ నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్నప్పటికీ, స్పీడ్ పొరపాటున ముంబై జట్టు పేరును ప్రస్తావించాడు. క్రికెట్‌పై పూర్తి అవగాహన లేకపోయినా, ఎలాగైనా కోహ్లీ దృష్టిలో పడాలనే లక్ష్యంతో అతను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

🚨| WATCH: Speed hits a wicket while playing cricket, then starts saying he needs to get signed to a cricket team 🏏
— Speedy HQ (@IShowSpeedHQ) May 3, 2026
“Virat Kohli call me… ICC call me, Mumbai cricket team call me” 😭🇮🇳 pic.twitter.com/IXAI2z7D4C
నిజానికి స్పీడ్‌కు క్రికెట్ కొత్తేమీ కాదు. గతంలో వెస్టిండీస్ పర్యటనలో మాజీ కెప్టెన్ డేరెన్ సామీ బౌలింగ్‌ను ఎదుర్కొన్న అతను ఫస్ట్ బాల్ బాదినప్పటికీ వెంటనే అవుటయ్యాడు. ఆ సమయంలో కూడా "నేను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ని..నన్ను విరాట్ కోహ్లీ అంటారు" అని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.అమెరికాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ, స్పీడ్ తన వైరల్ వీడియోల ద్వారా ఈ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తన లక్షలాది మంది అభిమానులకు పరిచయం చేస్తున్నాడు.
IShowSpeed plays Cricket with Saint Lucian Cricket Player Daren Sammy 🇱🇨🔥
— Speedy Updates (@SpeedUpdates1) April 28, 2026
and says
“I’m the best cricket player in the world—they call me Virat Kohli” 🔥 pic.twitter.com/hFQX22Vtkt
క్రికెట్ పట్ల స్పీడ్‌కు ఉన్న పిచ్చి కేవలం సరదా మాటలకే పరిమితం కాలేదు. 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు స్వయంగా హాజరైన అతను, 2024 టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ త్వరగా అవుట్ అయినప్పుడు కన్నీరు పెట్టుకోవడం చూస్తే అతని వీరాభిమానం ఎంతో అర్థమవుతుంది. ఒక అమెరికన్ యూట్యూబర్ అయి ఉండి, క్రికెట్ చుట్టూ అతను చేస్తున్నఈ హంగామా ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది.
🚨| WATCH: Speed's reaction to Virat Kohli losing his wicket during the IND vs. PAK match pic.twitter.com/zEGAzksiwJ
— Speedy HQ (@IShowSpeedHQ) June 9, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications