షాక్: ఔను! పిల్లల డైపర్లు మార్చానని కోహ్లీ(వీడియో)
న్యూఢిల్లీ: ఔను టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పిల్లల డైపర్లు మార్చేశాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం చేస్తున్నాడని తెలుసు గానీ, పెళ్లి, పిల్లల గురించి తెలియదే అనుకుంటున్నారా? అదేం లేదులెండి. ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ ఈ కార్యాన్ని చక్కబెట్టాడు.
జింబాబ్వే పర్యటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలో అతడు టీవీలో కనిపించనున్నాడు. స్టార్ వరల్డ్ ఛానల్‌లో యాంకర్ తారా శర్మ నిర్వహిస్తున్న షోలో విరాట్ కోహ్లి పాల్గొన్నాడు.

పిల్లల పెంపకం గురించి ఈ షోలో కోహ్లీ మాట్లాడని తారా శర్మ తెలిపారు. తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని చిన్నారులకు సూచించాడని చెప్పారు. తనకు ఇష్టమైన క్రికెట్ క్రీడను తాను ఎంచుకున్నానని కోహ్లీ చెప్పాడని తెలిపారు.
అంతేగాక పిల్లలకు డైపర్లు కూడా మార్చాడని వెల్లడించారు. 'ఔను డైపర్లు మార్చాను' అని కోహ్లి కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే స్టార్ వరల్డ్ ఛానల్‌లో ఈ షో ప్రసారం కానుంది. ఇది ఇలా ఉండగా, కోహ్లీ ట్విట్టర్ ఫాలోవర్ల సంక్య 11 మిలియన్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 11.2 మిలియన్ల ఫాలోవర్లతో టాప్ ఉన్నాడు. త్వరలోనే సచిన్‌ను కోహ్లీ అధిగమించే అవకాశాలు లేకపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications