For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : భారీ సెంచరీతో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే..!

Virat Kohli broke these records with his great innings

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ సెంచరీ చేశాడు. మూడున్నరేళ్లుగా టెస్టు సెంచరీ లేని అతను ఈ మ్యాచ్‌లో ఏకంగా 186 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఇంతకీ ఆ రికార్డులు ఏవో ఒకసారి చూస్తే..

ఈ సిరీస్‌లో టాప్ స్కోర్

ఈ సిరీస్‌లో టాప్ స్కోర్

భారత్‌లో జరుగుతున్న ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అలాగే నాలుగో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అద్భుతంగా ఆడాడు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అతను 180 పరుగుల భారీ స్కోరు చేశాడు. కోహ్లీ తన 186 పరుగుల ఇన్నింగ్స్‌తో ఖవాజాను దాటేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

 వేగంగా 75 సెంచరీలు..

వేగంగా 75 సెంచరీలు..

అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇది అతనికి టెస్టుల్లో 28వ శతకం. అలాగే ఓవరాల్‌గా 75వ అంతర్జాతీయ సెంచరీ. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ బాదినన్ని సెంచరీలు ఎవరూ చేయలేదు. అంతేకాదు క్రికెట్ చరిత్రలో కూడా సచిన్ ఒక్కడే కోహ్లీ కన్నా ఎక్కువ సెంచరీలు చేసి ఉన్నాడు. అయితే సచిన్ కన్నా వేగంగా కోహ్లీ తన 75 సెంచరీలు పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి 552 ఇన్నింగ్సులు పట్టింది. సచిన్ ఇన్ని సెంచరీలు చేయడానికి 566 ఇన్నింగ్సులు తీసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 75 సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

డబ్ల్యూటీసీలో టాప్ స్కోరర్

డబ్ల్యూటీసీలో టాప్ స్కోరర్

ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లీ.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2019లో మొదలైన డబ్ల్యూటీసీలో మొత్తం 52 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 1797 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 1794 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న రోహిత్ శర్మను అధిగమించాడు. ఈ జాబితాలో 1728 పరుగులతో పుజారా మూడో స్థానంలో ఉన్నాడు.

ఆసీస్‌కు పీడకల

ఆసీస్‌కు పీడకల

విరాట్ కోహ్లీలో బెస్ట్ చూడాలంటే ఆస్ట్రేలియాతో మ్యాచులు చూడాల్సిందే అనేంతలా ఆసీస్‌పై చెలరేగుతాడీ ఢిల్లీ బ్యాటర్. నాలుగో టెస్టులో కూడా ఇదే సీన్ కనిపించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కూడా కోహ్లీ దూసుకెళ్తున్నాడు. కంగారూలపై కోహ్లీ ఇప్పటి వరకు 4856 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ బ్రయాన్ లారా (4714 పరుగులు)ను దాటేసిన కోహ్లీ.. కంగారూలపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో 6707 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

 స్వదేశంలో 11 వేల పరుగులు

స్వదేశంలో 11 వేల పరుగులు

నాలుగో టెస్టులో సూపర్ ఇన్నింగ్స్‌తో స్వదేశంలో అత్యంత వేగంగా 11 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ మాత్రమే సాధించారు. భారత్‌లో సచిన్, ఆస్ట్రేలియాతో పాంటింగ్ 11 వేల పరుగుల మైలురాయిని అధిగమించారు. వీళ్లిద్దరూ ఈ మైలురాయి చేరుకోవడానికి 246 ఇన్నింగ్సులు పట్టింది. అయితే కోహ్లీ మాత్రం కేవలం 224 ఇన్నింగ్సుల్లోనే ఈ రికార్డు సాధించడం గమనార్హం. కోహ్లీ ఇప్పటి వరకు 51 హాఫ్ సెంచరీలు, 35 సెంచరీలతో స్వదేశంలో 11050 పరుగులు చేశాడు.

Story first published: Monday, March 13, 2023, 10:45 [IST]
Other articles published on Mar 13, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+