టెస్టు కెప్టెన్‌గా గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు.
టెస్టుల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు 38 టెస్టులకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ భారత జట్టుకు 22 విజయాలను అందించాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా కేవలం 7 మ్యాచ్‌ల్లో ఓటమిపాలవగా 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

27 విజయాలతో అగ్రస్థానంలో ధోని
కాగా, ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 27 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 49 టెస్టుల్లో 21 విజయాలతో, ఆజారుద్దీన్ 47 మ్యాచుల్లో 14 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో గంగూలీ విన్నింగ్ పర్సంటేజి 42.85గా ఉండగా, ధోనిది 45గా ఉంది.

38 మ్యాచ్‌ల్లో 22 విజయాలందించిన కోహ్లీ
ఇక, కోహ్లీకి వీరిద్దరితో పోలిస్తే 57.89గా ఉండటం విశేషం. ధోని 60 మ్యాచ్‌ల్లో భారత్ 27 విజయాలందించగా.. కోహ్లీ కేవలం 38 మ్యాచ్‌ల్లో 22 విజయాలందించాడు. 2014లో ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ ఆ తర్వాత వరుసగా శ్రీలంకపై రెండు సార్లు, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లపై టెస్టు సిరిస్‌లను నెగ్గాడు.

ఈ ఏడాది సఫారీ గడ్డపై టెస్టు సిరిస్‌ను కోల్పోయిన కోహ్లీసేన
ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓడినప్పటికీ, జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మొదటి రెండు టెస్టుల్లో కోహ్లీసేన ఓడిపోయింది.

ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిన కోహ్లీసేన
అయితే, మూడో టెస్టులో ఆతిథ్య జట్టును 203 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు తమపై నమ్మకం కోల్పోవద్దని అభిమానులను కోరిన విరాట్ కోహ్లీ తన మాట నిలబెట్టుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆటగాళ్లు, అభిమానుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications