Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: సైలెంట్ గా అజారుద్దీన్ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాక్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాక్ 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ కీలక మ్యాచ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాడు నసీమ్ షా క్యాచ్ పట్టడంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 157 క్యాచ్ లు పట్టాడు. ఇంతకు ముందు మహ్మద్ అజారుద్దీన్(156) పేరు మీదున్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ గొప్ప ఫీల్డర్ గా నిలిచిపోయాడు.

India vs Pakistan Live స్కోరు కార్డు

అంతర్జాతీయ క్రికెట్ పరంగా చూస్తే.. వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన మూడో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంకకు మహేల జయవర్ధనే(218) ఉండగా.. రెండో స్థానంలో రికీ పాంటింగ్(160) ఉన్నాడు. త్వరలోనే విరాట్ కోహ్లీ రికీ పాంటింగ్ ను కూడా అధిగమించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన టాప్ -5 ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ నిలవడం విశేషం. విరాట్ కోహ్లీ భారత జాతీయ క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి ఫీల్డ్ లో చాలా దూకుడుగా ఉన్నాడు.

Virat Kohli Breaks Azharuddin s Record in Style Creates History in India vs Pakistan Match

భారత్ తరఫున వన్డేలలో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్లు వీరే..

*విరాట్ కోహ్లీ-157
*మహ్మద్ అజారుద్దీన్-156
*సచిన్ టెండూల్కర్-140
*రాహుల్ ద్రవిడ్-124
*సురేష్ రైనా-102

Story first published: Sunday, February 23, 2025, 18:52 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+