బంగ్లాపై భారత్ విజయం: అజారుద్దీన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.
బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లలో కోహ్లీ, అజారుద్దీన్ 14 టెస్టు విజయాలతో సమానంగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించడంతో కోహ్లీ విజయాల సంఖ్య 15కు చేరింది.

టెస్టుల్లో కోహ్లీకి 15వ విజయం
అజారుద్దీన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ ఖాతాలో ఇది 15వ విజయం కాగా దీంతో అత్యధిక విజయాలు సాధించిన మూడవ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ కెప్టెన్సీలో సొంతగడ్డపై టీమిండియాకు ఇది నాలుగో సిరిస్ విజయం కావడం విశేషం.

తొలి కెప్టెన్‌గా కోహ్లీ కొత్త రికార్డు
ఈ ఘనతను సాధించిన భారత తొలి కెప్టెన్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా 47 మ్యాచ్‌లను ఆడగా అందులో 14 టెస్టుల్లో విజయం సాధించింది. ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ 2015లో తొలిసారి శ్రీలంకపై 2-1తో సిరిస్ కైవసం చేసుకున్నాడు.

వరుసగా ఆరు టెస్టు సిరిస్‌లను గెలిచిన కోహ్లీ
ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండిస్‌పై 2-0 (బయట), న్యూజింలాండ్‌పై 3-0, ఇంగ్లండ్‌పై 4-0 తేడాతో భారత్ సిరీస్‌లు దక్కించుకుంది. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లోనూ గెలుపొంది వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

భారత్‌కు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లు (Top 5):
27 (60 మ్యాచ్‌లు) - ధోని
21 (49 మ్యాచ్‌లు) - సౌరభ్ గంగూలీ
15 (23 మ్యాచ్‌లు) - విరాట్ కోహ్లీ
14 (47 మ్యాచ్‌లు) - అజారుద్దీన్
9 each - సునీల్ గవాస్కర్ (47 మ్యాచ్‌లు), మన్సుర్ అలీ ఖాన్ పటౌడీ (40 మ్యాచ్‌లు)
8 (25 మ్యాచ్‌లు) - రాహుల్ ద్రవిడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications