Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊరట: మ్యాచ్ ఓడినా, గేల్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

ముంబై: వరల్డీ టీ20లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌ను చిత్తు చేసింది. దీంతో టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించింది. దీంతో కోట్లాది మంది భారత అభిమానులు ఆశలు గల్లంతయ్యాయి.

కాగా మ్యాచ్‌పై ఏ మాత్రం అంచనాలు లేని వెస్టిండిస్... ఆ జట్టు ఆటగాడు సిమ్మన్స్ వీరోచితంగా పోరాడిన వేళ ధోనీ సేన ఫైనల్స్‌లోకి వెళ్లాలన్న కోరిక తీరలేదు. అసమాన పోరాట పటిమతో క్రికెట్ అభిమానులను కట్టిపడేసిన కరేబియన్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరుకు దూసుకెళ్లారు.

కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో సాధించిన 89 పరుగులు మాత్రం అతడి ఖాతాలోకి మరో రికార్డుని తెచ్చిపెట్టాయి. వరల్డ్ టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 16 అర్ధ సెంచరీలు సాధించాడు.

Virat kohli breaks another record overtakes two t20 specialists

అంతక ముందు టీ20ల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా క్రిస్ గేల్ (49 మ్యాచ్ ల్లో 15) రికార్డులకెక్కాడు. అతడి తర్వాతి స్థానంలో కివీస్ మాజీ సంచలనం బ్రెండన్ మెక్ కల్లమ్ (71 మ్యాచ్ ల్లో 15) ఉన్నాడు. ముంబైలో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ, క్రిస్ గేల్ రికార్డుని అధిగమించాడు.

ఇప్పటి వరకు 43 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 16 అర్ధ సెంచరీలు సాధించాడు. కాగా దిల్షాన్‌ 14, వార్నర్‌ 12, రోహిత శర్మ, షేన్ వాట్సన్‌, గప్తిల్‌ 11 అర్ధ సెంచరీలు సాధించారు. వెస్టిండిస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 47 బంతులాడిన కోహ్లీ 11 ఫోర్లు, సిక్సర్‌తో 89 నాటౌట్‌‌గా నిలవడంతో భారత్ 192 పరుగులు చేసింది.

టీమిండియా నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 3 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఫ్లెచర్ గాయంతో వెనుదిరగడంతో సిమ్మన్స్ జట్టులోకి వచ్చిన 51 బంతుల్లో చేసిన 82 పరుగులు (నాటౌట్) వెస్టిండిస్‌ను ఫైనల్‌ల్లోకి వెళ్లేలా చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+