Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డే/నైట్ టెస్టుకు సన్నాహాకం: ఇండోర్‌లో ప్లడ్ లైట్ల కింద కోహ్లీసేన ప్రాక్టీస్!

Virat Kohli & boys to train under lights in Indore with eye on Day/Night Test against Bangladesh

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను ప్లడ్ లైట్ల కింద నిర్వహించాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ)ను టీమిండియా మేనేజ్‌మెంట్ అభ్యర్ధించింది.

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. నవంబర్ 14 నుంచి ఇరు జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 22 నుంచి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. దీంతో డే/నైట్ టెస్టుకు ప్రాక్టీస్‌గా ఉంటుందని తొలి టెస్టుకి ముందే టీమిండియా ప్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది.

ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మిలింద్ కన్మాడికర్ ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "భారత జట్టు నుంచి మాకొక రిక్వెస్ట్ వచ్చింది. పింక్ బాల్ టెస్టు జరగనున్న నేపథ్యంలో ప్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేయాలని. కాబట్టి మేము ఆ దిశగా ఏర్పాట్లు చేయబోతున్నాం" అని తెలిపారు.

పింక్ బాల్ టెస్టుపై రహనే

పింక్ బాల్ టెస్టుపై రహనే

బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యంకే రహానే మాట్లాడుతూ పింక్ బాల్ టెస్టు ఛాలెంజ్‌లను స్వీకరించాలంటే అందుకు తగ్గట్లుగా శిక్షణ పొందాలని తెలిపాడు. "నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాను. ఇది కొత్త సవాల్. ఇది ఎలా మారుతుందో నాకు తెలియదు, కానీ ప్రాక్టీస్ సెషన్లలో ఆడితే మనకొక ఆలోచన వస్తుంది" అని అన్నాడు.

పింక్ బాల్ ఎంత స్వింగ్ అవుతుందో!

పింక్ బాల్ ఎంత స్వింగ్ అవుతుందో!

"పింక్ బాల్ ఎంత స్వింగ్ అవుతుందో... సెషన్ వారీగా ఎలా పనిచేస్తుందో మనకు కూడా ఓ ఆలోచన వస్తుంది. డే/నైట్ టెస్టు విషయంలో అభిమానుల దృక్పథం కూడా కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. పింక్ బాల్ కాబట్టి ఆలస్యంగా ఆడితే మంచిది. ఇది కేవలం నా వ్యక్తిగత ఆలోచన. సవాల్‌ను స్వీకరించడం సమస్య కాదు" అని రహానే అన్నాడు.

పుజారా మాట్లాడుతూ

పుజారా మాట్లాడుతూ

మరోవైపు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ పుజారా మాట్లాడుతూ "పింక్ బాల్‌తో ఆడేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నా" అని పుజారా తెలిపాడు. 2016 దులీప్ ట్రోఫీ ఎడిషన్‌లో కూకబుర్రా పింక్ బాల్‌తో ఆడిన పుజారా(453) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో రెండు సెంచరీల కూడా ఉన్నాయి.

ఆ అనుభవం సహాయపడుతుంది

ఆ అనుభవం సహాయపడుతుంది

కాగా, కోల్‌కతా వేదికగా జరిగే డే/నైట్ టెస్టు కోసం బీసీసీఐ ఇప్పటికే 72 ఎస్జీ పింక్ బాల్స్‌ను ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పుజారా తన అనుభవాన్ని పంచుకున్నాడు. "2016/17లో పింక్‌ బంతితో ఆడాను. దీనిని ప్రయోజనంగా పరిగణించలేము. అయితే, ఆ అనుభవం కచ్చితంగా నాకు సహకరిస్తుంది. మీరు పింక్ బాల్‌తో ఆడినప్పుడు, ఏ సమయంలో ఏమి ఆశించాలో... ఏమి ఆశించికూడదో తెలుసు. కాబట్టి ఆ అనుభవం సహాయపడుతుంది" అని పుజారా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 12, 2019, 13:29 [IST]
Other articles published on Nov 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+