
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిరోజ్ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధరించిన కోటుపై ధరించి ఓ ప్లాగ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
కోహ్లీ కోటుపై ఆ ప్లాగ్ ఏమిటి, ఆ ఫ్లాగ్ ఉన్న కోటు ఎందుకు ధరించాడు అని టీవీల్లో చూసిన ప్రేక్షకులకు సైతం చర్చించుకున్నారు. ఆ ప్లాగ్ ఏంటంటే....
డిసెంబర్ 7కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఆ రోజు 'భారత ఆర్మీ ఫ్లాగ్ డే' లేదా 'ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా' జరుపుతారు. ఆర్మీలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఆరోజు గుర్తు చేసుకుంటారు. 1949 నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న దీనిని ఆర్మీ ఘనంగా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఆరోజు ఆర్మీ వారోత్సవాలను కూడా జరుపుతుంది. ఇందులో భాగంగా మూడో టెస్టు కోసం టాస్ వేసేందుకు వచ్చిన కోహ్లీ తన కోటుపై ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా బ్యాడ్జిని ధరించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించే సమయంలో జట్టులోని ఆటగాళ్లు అందరూ బ్యాడ్జీలను ధరించి అమరవీరులకు నివాళులర్పించారు.