For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్ గెలవడం కష్టమేనా?: పోర్ట్ ఎలిజిబెత్‌లో ఒక్క మ్యాచ్ గెలవని టీమిండియా

By Nageshwara Rao
IND vs SA 5th ODI : A Challenge Before Virat Kohli & Co | Oneindia Telugu
Virat Kohli and Boys Look to Rewrite History in Port Elizabeth

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో వన్డే పోర్ట్ ఎలిజిబెత్‌లోని సెయింట్‌ జార్జ్‌ పార్క్ మైదానంలో జరగనుంది. ఇప్పటి వరకు భారత్‌ ఈ స్టేడియంలో నాలుగు వన్డేలు ఆడింది. భారత్ ఆడిన నాలుగు వన్డేల్లో ఒక్కదాంట్లో కూడా విజయం సాధించక పోవడం విశేషం.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. ఈ నాలుగు వన్డేల్లో భారత్‌ 200 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోవడం. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత పోర్ట్ ఎలిజిబెత్‌లోని సెయింట్‌ జార్జ్‌ పార్క్ స్టేడియంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కోహ్లీ సేన ఈ పిచ్‌పై భారత ఓటముల పరంపరకు బ్రేక్‌ వేస్తుందో.. లేక ఓటమి పాలువుతుందో మంగళవారం మ్యాచ్‌ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

 పోర్ట్ ఎలిజిబెత్‌లో భారత ఓటమి పరంపర ఇదీ

పోర్ట్ ఎలిజిబెత్‌లో భారత ఓటమి పరంపర ఇదీ

* అజారుద్దీన్‌ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి ఈ స్టేడియంలో 1992లో తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 147 ఆలౌటై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

* 1997లో సచిన్‌ నేతృత్వంలో ఆడిన భారత్‌ 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన దక్షిణాఫ్రికా 45.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

* 2006లో వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలోని టీమిండియా ఈ పిచ్‌పై మూడో వన్డే ఆడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 243 పరుగులు చేయగా, అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 163 పరుగులకే ఆలౌటైంది.

* చివరి సారిగా మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో 2011లో భారత్‌ ఈ స్టేడియంలో ఆడింది. అప్పుడు కూడా భారత్‌ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

 ఇక, ఈ సిరిస్‌లో జరిగే ఐదో వన్డేలో గనుక కోహ్లీసేన ఓటమి

ఇక, ఈ సిరిస్‌లో జరిగే ఐదో వన్డేలో గనుక కోహ్లీసేన ఓటమి

పాలైతే సిరిస్ 3-2గా నిలుస్తుంది. అదే గనుక జరిగితే సఫారీ గడ్డపై వన్డే సిరిస్ గెలవాలన్న భారత జట్టు కోరిక అందని ద్రాక్షలాగే మిగిలిపోయేలా ఉంది. ఎందుకంటే ఈ సిరిస్‌లో చివరిదైన ఆరో వన్డే ఆదివారం (ఫిబ్రవరి 18)న జోహెన్స్ బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరనుంది.

 ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే!

ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే!

సిరిస్‌ను చేజిక్కించుకోవాలంటే ఆరో వన్డే కోహ్లీసేన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కోహ్లీసేనను దురదృష్టం వెంటాడి ఆరో వన్డేలో కూడా ఓటమి పాలైతే సిరిస్ 3-3తో సమం అవుతుంది. ఆరో వన్డేకు ఆతిథ్యమిచ్చే జోహెన్స్ బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సఫారీలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సిరిస్‌ను మనకు కాకుండా చేసిన నాలుగో వన్డే కూడా ఈ వేదికపైనే జరగడం విశేషం.

 గులాబీ రెంగు జెర్సీల్లో సఫారీలు

గులాబీ రెంగు జెర్సీల్లో సఫారీలు

శనివారం జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య సఫారీ జట్టు గులాబీ రెంగు జెర్సీలను ధరించి ఆడారు. ఈ 'గులాబీ' సెంటిమెంట్ వారికి బాగా కలిసొచ్చింది. గులాబీ రంగు జెర్సీలు ధరించి ఆడిన ఏ ఒక్క వన్డే కూడా ఓడిపోలేదు. అయితే నాలుగో వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ చూసిన వారంతా గులాబీ సెంటిమెంటుకు బ్రేక్‌ పడుతుందనే ఊహించారు. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డుపడి దక్షిణాఫ్రికా విజయం సాధించేలా చేశాడు. దీంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే సఫారీలు లక్ష్యాన్ని ఛేదించారు.

Story first published: Monday, February 12, 2018, 13:38 [IST]
Other articles published on Feb 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+