Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఖరి వన్డే: ఇండియన్ హైకమిషన్‌లో కోహ్లీసేన, ఫోటోలు, విందు

హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారాం ఇరు జట్ల మధ్య గురువారం రాత్రి 7.30 నిమిషాలకు సిరిస్‌లో ఆఖరి వన్డే జరగనుంది. మైకాలోని కింగ్ స్టన్ స్టేడియంలో ఆ వన్డే జరగనుంది. ఆఖరి వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే కింగ్ స్టన్‌కు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం జమైకాలోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయాన్ని టీమిండియా సందర్శించింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు హైకమిషన్‌ చేరుకున్న కోహ్లీ సేనకు అక్కడి కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగారు.

Virat Kohli and Boys Have a Blast Over Dinner in Jamaica

ఫోటోలు దిగిన అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ కోహ్లీతో పాటు ధోని, యువరాజ్ సింగ్, ధావన్‌, జడేజా, భువనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులు హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

ఆఖరి వన్డేలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు 119 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మురళీధరన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

Virat Kohli and Boys Have a Blast Over Dinner in Jamaica

వెస్టిండిస్‌తో గురువారం కింగ్ స్టన్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో కూడా నాటౌట్‌గా నిలిస్తే అత్యధిక మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా ధోని చరిత్ర సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతున్న సబీనా పార్కు స్టేడియంలో గత 32 వన్డేల్లో విండీస్‌ 24 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+