న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి అంత గొప్పదనం రావడానికి కారణం?

'Born Great or Made' Survey On Virat Kohli
Virat Kohli, Born Great or Made? 75% Indians believe Kohli is Made, says National Geographic Survey

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంత స్థాయి చేరుకోవడానికి గల కారణాలేంటి.? అతని సామర్థం మెరుగవడానికి దోహదపడినవి ఏంటి? అనే అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో కోహ్లీ చిన్నప్పటి నుంచి అంతటి నైపుణ్యంతో ఉన్నాడా.. లేదా మరేదైనా కారణముందా అని అడిగిన ప్రశ్నకు 75శాతం కష్టానికి మద్ధతు తెలుపగా మిగిలిన 25 శాతం మంది ప్రత్యేక నైపుణ్యాలు అతణ్ని అంతటి వాడిని చేశాయంటూ చెప్పుకొచ్చారు.

సొంత రెస్టారెంట్‌లో కోహ్లీకి కంపెనీ ఇచ్చింది ఎవరంటే..!!సొంత రెస్టారెంట్‌లో కోహ్లీకి కంపెనీ ఇచ్చింది ఎవరంటే..!!

కోహ్లీతో పాటుగా మరి కొందరు ప్రముఖుల జీవితాలపై చేస్తున్న సర్వేలో అభిమానుల నుంచి సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది మీడియా. ఈ క్రమంలో 'బోర్న్ ఆర్ మేడ్' అనే సర్వేను నిర్వహించింది. అంటే పుట్టుకతోనా.. లేదా తనకు తానుగా మలచుకోగలిగినవా అని ఇందులో దాదాపు లక్ష మంది నుంచి ఐదు రోజుల పాటు సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరించారు.

ఇందులో భారతీయులు 75శాతం మంది అతని కష్టం మీదే.. ప్రతిభకు పదును పెట్టడం చేతనే ఇలా అయ్యాడని బదులివ్వగా మరికొందరు మాత్రం కోహ్లీ పుట్టుకతోనే ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ సర్వేను ఆన్ లైన్ పోల్ ద్వారానూ మరి కొంత మేర సోషల్ మీడియా ద్వారా నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు.

కోహ్లీతో పాటుగా కమల్ హాసన్, ఏపీజే అబ్దుల్ కలాం, కిరణ్ బేడీ, దలైలామాలపై కూడా సర్వే నిర్వహించింది నేషనల్ జియోగ్రఫిక్ మీడియా. వీటన్నిటినీ కలిపి ఐదు పార్ట్‌ల సిరీస్‌గా ప్రసారితం కానున్న కార్యక్రమం కోహ్లీతో మొదలుకానుంది.

కార్యక్రమానికి హోస్ట్‌గా ఆర్. మాధవన్ హాజరవుతుండగా సైకోఅనలస్టిలు, సైంటిస్టులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కొక్కరి జీవితగాథలు ప్రసారం కానున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంపై నిశితమైన పరిశీలన జరిపి సాధారణ ప్రజల అభిప్రాయ సేకరణతో సహా పూర్తి వివరణతో తెలియజేయనున్నారు.

Story first published: Tuesday, September 25, 2018, 12:01 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X