Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డీఆర్ఎస్ 'చీటింగ్': స్మిత్‌పై కోహ్లీ సంచలనం, మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు ఆ జట్టు ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బెంగుళూరు టెస్టు విజయానంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

డీఆర్ఎస్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారని కోహ్లీ విమర్శించాడు. ఆసీస్‌తో మైదానంలో స్లెడ్జింగ్ చేస్తూ ఆటడం, స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించడం రెండూ వేరేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ లక్ష్మణ రేఖను దాటాడని, దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

కెప్టెన్ స్మిత్ హైడ్రామా

కెప్టెన్ స్మిత్ హైడ్రామా

ఉమేశ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైన తర్వాత ఆసీస్ కెప్టెన్ స్మిత్ మైదానాన్ని వీడకుండా హైడ్రామా చేయడంపై కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న హ్యాండ్ స్కోంబ్‌తో చర్చించన తర్వాత ఏదైనా డౌట్ ఉండే రివ్యూ కోరాలి గానీ, తన అవుట్‌పై డ్రెస్సింగ్ రూమ్ సభ్యులను స్మిత్ కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కోహ్లీ చెప్పాడు.

మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశానన్న కోహ్లీ

మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశానన్న కోహ్లీ

ఈ విషయంపై ఫీల్డ్ అంఫైర్లతో పాటు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశానని, గత మూడు రోజులుగా వారి తీరు ఇదే విధంగా ఉందని, మంగళవారం స్మిత్ ఇంకా తీవ్ర స్థాయి చర్యకు దిగాడని ఆగ్రహం కోహ్లీ వ్యక్తం చేశాడు. ఈ టెస్టులో తమ బ్యాట్స్ మన్, బౌలర్లు ఆసీస్ వ్యూహాలను చిత్తుచేశారని కోహ్లీ అన్నాడు.

బెంగుళూరు టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకం

బెంగుళూరు టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకం

ఈ టెస్టు మాకు ఎంతో ప్రతిష్టాత్మకమని, జట్టు అంతా కూడా ఎంతో ఉద్వేగానికి లోనైందని కోహ్లీ చెప్పాడు. పూణె టెస్టు ఓటమితో జట్టంతా ఒత్తిడికి గురైందని, బెంగుళూరు టెస్టులో విజయం సాధించి, సిరీస్‌ను సమం చేశామని చెప్పాడు. ఈ విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు.

మిగిలిన రెండు టెస్టుల్లో ఇలాగే ఆడుతాం

మిగిలిన రెండు టెస్టుల్లో ఇలాగే ఆడుతాం

మిగిలిన రెండు టెస్టుల్లో ఇదే విధంగా పట్టుదలతో ఆడుతామని కోహ్లీ తెలిపాడు. సవాళ్లను స్వీకరించి, అధిగమించడం తమకు ఇష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, బెంగుళూరు టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.

75 పరుగుల తేడాతో ఘన విజయం

75 పరుగుల తేడాతో ఘన విజయం

దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ 1-1తో సమం చేసింది. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+