సచిన్, లారా కంటే కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడు: మాజీ కెప్టెన్ సంచలనం

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే, కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడంటూ పేర్కొన్నాడు. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ 41వ సెంచరీని సాధించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
సచిన్, లారాను వెనక్కునెట్టిన కోహ్లీ
వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు ఆగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాలను విరాట్ కోహ్లీ వెనక్కి నెట్టాడని వాన్ చెప్పుకొచ్చాడు. మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఓ అభిమాని సచిన్, లారా కంటే గొప్పవాడా? అంటూ ప్రశ్నించాడు.
అవును, వన్డేల్లో మాత్రమే
దీంతో ఆ అభిమాని ట్వీట్‌కు వాన్ అవును, వన్డేల్లో మాత్రమే అని సమాధానమిచ్చాడు. దీంతో మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా కోహ్లీ, సచిన్‌లలో ఎవరు గొప్ప అనే అంశంఫై అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వన్డేలో 41వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ
రాంచీ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 41వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ.. కోహ్లీ సెంచరీతో మెరిసినప్పటికీ టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

కోహ్లీ ఫామ్‌ను చూస్తుంటే
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూస్తుంటే వన్డేల్లో సచిన్ టెండూల్కర్(49) అత్యధిక సెంచరీల రికార్డును త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఆగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications