టీమిండియాలో బెస్ట్ డ్యాన్సర్ అతడే: కోహ్లీకి అశ్విన్ ప్రశంస
హైదరాబాద్: టీమిండియాలో బెస్ట్ డ్యాన్సర్ విరాట్ కోహ్లీయే అంటూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బుధవారం ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సియట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డులు-2017 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2016-17 సంవత్సరానికి గాను 'అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని అందుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు అశ్విన్ సమాధానం చెబుతూ భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మంచి గాయకులు, డ్యాన్సర్లు అని అన్నాడు.

ఆ తర్వాత ఇదే ప్రశ్నకు సురేశ్ రైనా సమాధానం చెబుతూ తనకంటే కోహ్లీనే మంచి డ్యాన్సర్ అని చెప్పుకొచ్చాడు. డ్యాన్స్‌లోనే కాదు తనకంటే మెరుగ్గా పాడటంలోనూ కోహ్లీనే ముందుంటాడని సురేశ్ రైనా తెలిపాడు. కోహ్లీ చివరిసారిగా యువీ పెళ్లి వేడుకలో తన ప్రేయసి అనుష్క శర్మతో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు చేరుకుంది. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications