Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

100 మిలియన్ ఫాలోవర్లు: తొలి క్రికెటర్‌‌గా విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డు

Virat Kohli Is 1st Cricketer With 100 Million Fans On Social Media ! || Oneindia Telugu
Virat Kohli becomes the first cricketer to reach 100m followers on social media

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన సాధించాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్‌లో ఎన్నో రికార్డులను అధిగమించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కోహ్లీ పాపులారిటీ అమాంతం పెరిగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా సోషల్‌ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వివిధ సోషల్‌ మీడియా సైట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్(10 కోట్ల) మార్క్‌కు చేరింది. ఫేస్‌బుక్‌లో 37 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 33.5 మిలియన్, ట్విటర్‌లో 29.4 మిలియన్ మంది కోహ్లీని ఫాలో అవుతున్నారు.

రొనాల్డో, మెస్సీలకు అత్యధిక మంది ఫాలోవర్లు

రొనాల్డో, మెస్సీలకు అత్యధిక మంది ఫాలోవర్లు

ఇక, ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నెమార్‌కు అత్యధిక మంది ఫాలోవర్లను ఉన్నారు. పోర్చుగల్ పుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను ట్విట్టర్‌లో 77 మిలియన్, ఫేస్‌బుక్‌లో 122 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 166 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

కోహ్లీ వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీ

కోహ్లీ వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీ

ఆ తర్వాత బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నెయమార్ జూనియర్‌ను ట్విట్టర్‌లో 43 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీని ఫేస్‌బుక్‌లో 89 మిలియన్ ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. కాగా, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.

టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి

టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999).

ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ వేదిక

ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ వేదిక

కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ వేదికకానుంది.

Story first published: Sunday, May 19, 2019, 10:19 [IST]
Other articles published on May 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+