8000 పరుగులు: టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు
దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 243 ఇన్సింగ్స్‌లో విరాట్ కోహ్లీ టీ20ల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకోగా... సురేశ్ రైనా 284 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కోహ్లీ 35 హాఫ్ సెంచరీలు సాధించాడు.

5 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ
ఇదిలా ఉంటే, కోల్‌కతా రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం కావడం విశేషం. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను కూడా సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే చేధించింది.

13 బంతుల్లో 48 పరుగులు చేసిన రసెల్
కోల్‌కతా జట్టులో ఆండ్రీ రస్సెల్ (48; 13 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 19.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 206 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అంతకముందు విరాట్ కోహ్లీ(84; 49 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్(63; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications