India vs New Zealand, 2nd ODI: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు


హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లీ సాధించిన పరుగులు 1242.

నాధన్ ఆస్టల్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ
ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు నాధన్ ఆస్టల్(1207) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే, వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(1750) అగ్రస్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్(1157) పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఓపెనర్లు చక్కటి శుభారంభం
కాగా, రెండో వన్డేలో భారత్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు తొలి వికెట్‌కు 154 పరుగులు జోడించారు. వీరిద్దరి మధ్య ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. జట్టు స్కోరు 154 వద్ద ట్రెంట్ బౌల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్(66) వికెట్ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మూడో వికెట్‌గా పెవిలియన్‌కు కోహ్లీ
ఆ తర్వాత కొద్దిసేపటికే ఫర్గూసన్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని సిక్స్‌గా తరలించేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ(87) ఫీల్డర్ గ్రాండ్‌హోమ్ చేతికి చిక్కాడు. దీంతో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ-అంబటి రాయుడుల జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రాయుడుతో కలిసి 64 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

టీమిండియా 324/4
దూకుడుగా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (43)ని షార్ట్‌పిచ్ బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన అంబటి రాయుడు(47) పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని (48 నాటౌట్), కేదార్ జాదవ్ (22 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications