Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4వ ఇన్నింగ్స్: కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియాను ఓటమి అంచు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 49 ఓవర్లలో 310 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి బారి నుంచి తప్పించి తొలి టెస్టును డ్రాగా ముగించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్‌ను ఓడించి, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ల ఆధిక్యాన్ని సంపాదించేందుకు 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపించింది. రెండో ఓవర్‌లోనే గౌతం గంభీర్ డకౌట్ కావడంతో, పరుగుల ఖాతాను తెరవక ముందే భారత్ ఒక వికెట్ చేజార్చుకుంది. చటేశ్వర్ పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 18 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రషీద్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మురళీ విజయ్ 71 బంతుల్లో 31 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లోనే హసీబ్ హమీద్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ, 68 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్ మరో మూడు పరుగులకే నాలుగో వికెట్‌గా ఆజింక్య రహానేను చేజార్చుకుంది.

Virat Kohli becomes India's best fourth innings batsman, fairs Gavaskar's average

వికెట్ల పతనం ఒకానొక దశలో భారత అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడ్డాడు. జడేజా (32), కోహ్లీ దాదాపు 10 ఓవర్ల పాటు ఆచితూచి ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటూ డ్రాగా గట్టెక్కించారు.

నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత పిచ్‌లపై నిలకడగా రాణించడమంటే ఆషామాషీ కాదు. అయితే రాజ్ కోట్ టెస్టులో కోహ్లీ నిలదొక్కుకోవడానికి ఎంతో ఓపికగా ఇన్నింగ్స్‌ను ఆడాడు. క్రీజులో దూకుడుగా ఆడే కోహ్లీ ఆటతీరుతో పోలిస్తే రాజ్‌కోట్ ఇన్నింగ్స్ ప్రత్యేకమనే చెప్పాలి.

అంతేకాదు నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ క్రికెట్ మాజీలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల బ్యాటింగ్ యావరేజిని అధిగమించాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటివరకు 15 సందర్భాల్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి 65.27 యావరేజిని నమోదు చేశాడు.

అదే 33 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన గవాస్కర్ 58.25 యావరేజితో రెండో స్ధానంలో ఉన్నాడు. అంతేకాదు నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ యావరేజి టెస్టు క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లను మించి ఉండటం గమనార్హం.


Player Inns Runs HS Avg 100/s 50/s
Virat Kohli 15 718 141 65.27 2 4
Sunil Gavaskar 33 1398 221 58.25 4 8
Rahul Dravid 56 1552 103* 40.84 1 9
VVS Laxman 38 1095 103* 40.55 1 7
Sourav Ganguly 32 864 101* 37.56 1 3
Sachin Tendulkar 60 1625 136 36.93 3 7
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+