
ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం
కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా సిరిస్‌లో ఇంకో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా వరుసగా ఎనిమిదో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అరుదైన రికార్డుని సాధించిన కోహ్లీ
ఈ వరుస సిరిస్ విజయాలన్నీ కూడా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సాధించడం విశేషం. ఇదిలా ఉంటే కొలంబో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కెప్టెన్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకలో వరుసగా రెండో టెస్ట్ సిరీస్‌ను సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

2015లో 2-1తో సిరిస్ కైవసం
అంతకుముందు 2015లో కోహ్లీ నేతృత్వంలో టీమిండియా శ్రీలంకలో 2-1తో సిరీస్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు లంకలో ఇన్నింగ్స్ తేడాతో గెలవడం కూడా భారత్‌కు ఇదే తొలిసారి. ఇక్కడ ఇన్నింగ్స్ విజయాన్ని సాధించిన మొదటి భారత క్రికెట్ కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఆ రికార్డు ఆసీస్ పేరిటే ఉంది
ఇక అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించే క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాను కోహ్లీని వెనుక్కినెట్టాడు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కంటే కోహ్లీ ఒక సిరీస్ వెనుకంజలో ఉన్నాడు. వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌లు ఘనత ఆసీస్ పేరిట ఉంది. 2005 నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఆసీస్ జట్టు వరుసగా తొమ్మిది సిరీస్ విజయాల్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications