కెప్టెన్‌గా కోహ్లీ 9000: నాగ్‌పూర్ వన్డేలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(116) సెంచరీ సాధించడంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
తద్వారా వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ పేరుపై ఉండేది. పాంటింగ్ 204 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ అత్యంత వేగంగా
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి కాదు. కోహ్లీ ఇప్పటి వరకు సాధించిన పరుగులన్నీ అత్యంత వేగంగా సాధించినవే. 4 వేలు, 5 వేలు, 6 వేలు, 7వేలు, 8 వేల పరుగులను అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే సాధించిన కోహ్లీ ఆ రికార్డులన్నీ తన పేరిట లిఖించాడు.
2014-15లో ధోని నుంచి కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు
2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో ధోని నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, రెండో వన్డేలో విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది.
వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ
ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (21)తో పాటు అంబటి రాయుడు (18) విఫలమైనా.. రెండో ఓవర్ నుంచి 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లి జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా చూడచక్కని ఫోర్ బాదిన కోహ్లీ 40వ సెంచరీని పూర్తి చేశాడు.
కోహ్లీతో పాటు మెరిసిన విజయ్ శంకర్
కోహ్లీతో పాటు విజయ్ శంకర్ (46) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో భారత్ జట్టుని గెలిపించిన కేదార్ జాదవ్ (11), ధోనిలు ఈ మ్యాచ్‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. జట్టు స్కోరు 248 వద్ద కోహ్లీ ఔటవగా.. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలోనే కుల్దీప్ యాదవ్ (3), జస్‌ప్రీత్ బుమ్రా (0) వికెట్లు చేజార్చుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్ నైల్, మాక్స్‌వెల్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications