సచిన్ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యంత వేగంగా కోహ్లీ పదివేల పరుగులు


హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. మరోవైపు సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఇప్పటివరకు సచిన్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
44 పరుగుల వద్ద కోహ్లీకి లైఫ్
ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 44 పరుగుల వద్ద తనకు లభించిన లైఫ్‌ను కోహ్లీ చక్కగా వినియోగించుకుని పరుగుల వరద పారించాడు. 91 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేయడంతో కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు.
పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే
* విరాట్ కోహ్లీ (213 వన్డేలు- భారత్)
* సచిన్ తెందుల్కర్ (266- భారత్)
* సౌరవ్ గంగూలీ (272- భారత్)
* రికీ పాంటింగ్ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్ కలిస్ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్ ధోనీ (320- భారత్)
* బ్రియన్ లారా (287- వెస్టిండీస్)
* రాహుల్ ద్రవిడ్ (309- భారత్)
సొంతగడ్డపై 4000 పరుగులు
సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్, ధోనిలు అందుకున్నారు. సొంతగడ్డపై 4000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 92 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
విండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ
ఈ వన్డేలోనే వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 1,573 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 1,574 పరుగులతో తాజాగా ఆ రికార్డుని కోహ్లీ బద్దలుకొట్టాడు. కోహ్లీ, సచిన్ తర్వాత.. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లుగా రాహుల్ ద్రవిడ్ (1348), సౌరవ్ గంగూలీ (1142) టాప్-4లో కొనసాగుతున్నారు. 38 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(83), ధోని (16) పరుగులతో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications