Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డివిలియర్స్ రికార్డు బద్దలు: కెప్టెన్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా

అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కెప్టెన్‌గా 2000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 36 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇప్పటి వరకూ ఏబీ డివిలియర్స్ (41 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న 'కెప్టెన్' రికార్డును కోహ్లీ అధిగమించాడు.

రెండు వేల పరుగుల్ని పూర్తి చేయడానికి

రెండు వేల పరుగుల్ని పూర్తి చేయడానికి

వన్డేల్లో కెప్టెన్‌గా రెండు వేల పరుగుల్ని పూర్తి చేయడానికి ఏబీ డివిలియర్స్‌కి అవసరమైన ఇన్నింగ్స్‌లు 41. అయితే కోహ్లీ ఇంకా ఐదు ఇన్నింగ్స్‌లు ముందుగానే ఆ మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు వన్డేకి ముందు కోహ్లీ ఈ ఘనతను సాధించడానికి 13 పరుగులు అవసరమయ్యాయి.

21 పరుగులు చేసి అవుటైన కోహ్లీ

21 పరుగులు చేసి అవుటైన కోహ్లీ

అయితే గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు. ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన ఇప్పటికే సొంతం చేసుకుంది. దీంతో నామమాత్రమైన నాలుగో వన్డేలో కోహ్లీ సేన ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 334 పరుగులు చేసింది.

భారత్‌పై 21 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

భారత్‌పై 21 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో రహానే 53, రోహిత్ శర్మ 65, కోహ్లీ 21, పాండ్యా 41 పరుగులు చేయగా... జాదవ్ 67, పాండే 33, ధోనీ 13, షమీ 6, అక్షర్ పటేల్ 5, ఉమేశ్ యాదవ్ 2 పరుగులు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+