9000: డివిలియర్స్ రికార్డు బద్దలు, ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ
హైదరాబాద్: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ అరుదైన ఘనత
202వ వన్డేల్లో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో 83 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ
తద్వారా వన్డేల్లో 9 వేల పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి ముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజహరుద్దీన్, ధోని 9 వేల పరుగులు చేశారు.
అత్యంత వేగంగా 9వేల పరుగులు
కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ తన 194వ ఇన్నింగ్స్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు
దీంతో, గతంలో 205 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, ఇప్పటికే అన్ని ఫార్మాట్లు కలిపి 2 వేలకు పైగా పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications