
హైదరాబాద్: గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని తమ వద్దే అట్టిపెట్టుకునేందుకు గాను ఆ ప్రాంఛైజీ రూ. 17 కోట్లు చెల్లించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతకముందు 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోసం వేలంలో రూ. 15 కోట్లు చెల్లించింది. ఇదే ఇప్పటికే వరకు అత్యధికం. తాజాగా గురువారం జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో విరాట్ కోహ్లీ ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్‌ను తన వద్దే అట్టిపెట్టుకుంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు ఢిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలను ఆయా ఫ్రాంచైజీలు తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. వీరిద్దరి కూడా ఆయా ప్రాంఛైజీలు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు చెల్లించాయి. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లకు రూ. 12 కోట్లను ఆయా ప్రాంఛైజీలు చెల్లించాయి.
ఐపీఎల్-2016 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 18 మ్యాచ్‌లాడిన కోహ్లీ 81.08 యావరేజితో 973 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక, ఐపీఎల్ 10వ సీజన్‌లో గాయం కారణంగా తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కోహ్లీ ఆ తర్వాత కేవలం పది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ పది మ్యాచ్‌ల్లో 30.80 యావరేజితో 308 పరుగులు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్: ధోని (రూ. 15 కోట్లు); రైనా (రూ. 11 కోట్లు), జడేజా (రూ. 7 కోట్లు)
వేలంలో ఖర్చు చేసేందుకు మిగిలిన మొత్తం: రూ. 47 కోట్లు
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 2
ఢిల్లీ డేర్‌డెవిల్స్: రిషబ్ పంత్ (రూ. 8కోట్లు), క్రిస్ మోరిస్ (రూ. 7.1 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ. 7 కోట్లు)
మిగిలిన మొత్తం: రూ. 47 కోట్లు
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 2
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: అక్షర్ పటేల్ (రూ. 6.75 కోట్లు)
మిగిలిన మొత్తం: 67.5 కోట్లు,
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 3
కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్ (రూ. 8.5 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ. 7 కోట్లు)
మిగిలిన మొత్తం: (రూ. 59 కోట్లు),
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 2
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (రూ. 15 కోట్లు), హార్ధిక్ పాండ్య (రూ. 11 కోట్లు), జస్ప్రిత్ బుమ్రా (రూ. 7 కోట్లు)
మిగిలిన మొత్తం: రూ. 47 కోట్లు
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 2
రాజస్థాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్ (రూ. 12 కోట్లు)
మిగిలిన మొత్తం: రూ. 67.5 కోట్లు;
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 3
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (రూ. 17 కోట్లు), డివిలియర్స్ (రూ. 11 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ. 1.75 కోట్లు)
మిగిలిన మొత్తం: రూ. 49 కోట్లు;
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 2
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (రూ. 12 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 8.5 కోట్లు)
మిగిలిన మొత్తం: రూ. 59 కోట్లు
ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్)- 3
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.