For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10 సార్లు రెండొందలకు పైగా: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లీ

శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ సెంచరీతో చేయడంతో పాటు రెండో వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డుని సాధించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ సెంచరీతో చేయడంతో పాటు రెండో వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

తద్వారా వన్డేల్లో 10 సార్లు రెండొందల పరుగుల్ని జత చేయడంలో కోహ్లీ భాగమయ్యాడు. ఈ ఘనతను పదిసార్లు సాధించిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డుని తన పేరిట నెలకొల్పాడు. కాగా, శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Virat Kohli becomes 1st player to stitch 10 double-century stands in ODIs

శ్రీలంకపై 44 ఇన్నింగ్స్‌లోనే 2000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 168 బంతుల్లో 219 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇలా 200కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఈ జోడీకి మూడోసారి.

నాలుగో వన్డేలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ 76 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులను నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 28 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత 30 సెంచరీలతో ఆసీస్ మాజీ క్రికెటర్ రికీపాంటింగ్ ఉన్నాడు. ఈ సిరిస్‌లో మరో మ్యాచ్ మిగిలుండటంతో రికీ పాంటింగ్‌ను కోహ్లీ సమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కోహ్లీ 185 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే సచిన్‌కు 265, పాంటింగ్‌ 330 ఇన్నింగ్స్‌ తీసుకున్నారు.

వన్డేల్లో కోహ్లీ రెండొందలకు పైగా నెలకొల్పిన భాగస్వామ్యాలివే:

1. 224, with Gautam Gambhir for 3rd wicket vs SL, Kolkata, 24 Dec 2009

2. 219, with Rohit Sharma for 2nd wicket vs SL, Colombo (RPS), 31 Aug 2017

3. 213, with Ajinkya Rahane for 3rd wicket vs BAN, Fatullah, 26 Feb 2014

4. 212, Shikhar Dhawan for 2nd wicket vs AUS, Canberra, 20 Jan 2016

5. 209*, with Gautam Gambhir for 3rd wicket vs ENG, Delhi, 17 Oct 2011

6. 207, with Rohit for 2nd wicket vs AUS, Perth, 12 Jan 2016

7. 205, with Gautam Gambhir for 2nd wicket vs SL, Dhaka, 13 Mar 2012

8. 203, with Virender Sehwag for 3rd wicket vs BAN, Dhaka, 19 Feb 2011

9. 202, with Rohit for 3rd wicket vs SL, Kolkata, 13 Nov 2014

10. 200, with Kedar Jadhav for 5th wicket vs ENG, Pune, 15 Jan 2017

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+