For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి భారతీయుడిగా కోహ్లీ రికార్డు.. విరాట్ తర్వాతే ప్రియాంక, దీపికా!!

Virat Kohli became the first Indian to get 50 million followers on Instagram

ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత తరంలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో అద్భుతాలు సృష్టించగలడు. మైదానంలో బ్యాట్‌తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే కోహ్లీ.. తాజాగా మైదానం వెలుపల కూడా రికార్డులు కొల్లగొడుతున్నాడు. కోహ్లీ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దూసుకువెళ్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.

విరాట్ తర్వాతే ప్రియాంక, దీపికా:

విరాట్ తర్వాతే ప్రియాంక, దీపికా:

విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 930 పోస్టులు చేశాడు. 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో భారత దేశంలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పడుకోణెలను కూడా అధిగమించాడు. రెండ‌వ స్థానంలో ఉన్న ప్రియాంకా చోప్రాకు 49.9 మిలియ‌న్ల ఫోలోవ‌ర్లు ఉన్నారు. ఆ త‌ర్వాత 44.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌తో దీపికా పడుకోణె మూడ‌వ స్థానంలో ఉంది. కోహ్లీ బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

 బ్రాండ్ విలువలోనూ ఆధిపత్యం:

బ్రాండ్ విలువలోనూ ఆధిపత్యం:

విరాట్ కోహ్లీ తన బ్రాండ్ విలువలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. కోహ్లీ వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్‌ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. ఇటీవలే 'ద డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌' అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం.. రూ.1690 కోట్ల బ్రాండ్‌ విలువతో కోహ్లీ భారత్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2019లో విరాట్ బ్రాండ్‌ వాల్యూ 39 శాతం పెరిగి రూ. 1690 కోట్లకు చేరింది. 2018 నుంచి 2019కి బ్రాండ్‌ విలువ 39 శాతం పెరిగిందంటే.. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌:

వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌:

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం కోహ్లీ హవా తగ్గింది. కోహ్లీ 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి వీరిద్దరే టాప్‌-10లో చోటు దక్కించున్నారు. వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. కోహ్లీ 869 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్నాడు.

నాలుకలు బయటకు పెట్టి:

నాలుకలు బయటకు పెట్టి:

కోహ్లీ ఆదివారం ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. న్యూజిలాండ్‌ ఎలె‌వన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సందర్భంగా కోహ్లీ సంతోషంతో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో కోహ్లీతో పాటు పేసర్‌ మహ్మద్‌ షమీ, ఓపెనర్‌ పృథ్వీషా ఉన్నారు. ఈ ముగ్గురూ తమ కళ్లని విచిత్రంగా పైకి తిప్పుతూ నాలుకలు బయటకు పెట్టి ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోను కోహ్లీ నయా పోస్టు, సుందర్ దోస్త్ అనే క్యాప్షన్‌‌తో షేర్ చేశాడు.

Story first published: Tuesday, February 18, 2020, 13:03 [IST]
Other articles published on Feb 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+