కోహ్లీ 5కోట్లు : ఆ మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ భాయ్..!

కింగ్ కోహ్లీ అంటే రికార్డులకు పెట్టింది పేరు. ఇటీవలే సుమారు 1000రోజుల నిరీక్షణకు తెరదించుతూ ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఆఫ్ఘన్‌పై సెంచరీతో కదం తొక్కాడు. కోహ్లీ బ్యాట్ నుంచి 70సెంచరీలు అలవోకగా రాగా.. ఈ సెంచరీ మాత్రం అంతులేని స్ట్రగుల్ నుంచి వచ్చింది. పేలవ్ ఫామ్‌తో కొన్నాళ్లుగా తీవ్రంగా సతమతమవుతున్న కోహ్లీ ఆసియాకప్ టోర్నీలో మాత్రం మంచి ఫామ్ అందుకున్నాడు. 276పరుగులతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ సెంచరీతో ఆఫ్ఘన్‌తో మ్యాచ్ అనంతరం.. విరాట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
కొందరు వీధుల్లో బాణసంచాలు పేల్చారు. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టాడు. టీ20ల్లో తొలి సెంచరీ చేసిన కోహ్లీ.. భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు (122)కూడా అతని పేరిట నమోదైంది. ఇకపోతే తాజాగా క్రికెట్లో కాకుండా కోహ్లీ సోషల్ మీడియాలో కూడా అరుదైన ఘనత సాధించాడు. 50మిలియన్ల (5కోట్లమంది) ఫాలోవర్ల సంఖ్యను చేరుకున్నాడు. ఈ రికార్డ్ చేరుకున్న తొలి క్రికెటర్ కూడా విరాట్ కావడం విశేషం.
ఇక అథ్లెట్ల పరంగా చూసుకుంటే ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (103.4మిలియన్లు) 10కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. మరో ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్ మర్ (57.9మిలియర్లు), 57.9కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే కోహ్లీకి ఇన్ స్టాలో 211మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే 21కోట్ల మంది ఫాలోవర్లు అన్నమాట.
ఇక ఆఫ్ఘన్ మ్యాచ్‌లో తన సత్తా కించిత్ కూడా తగ్గలేదన్నట్లు మెరుపు షాట్లతో స్టేడియం నలుదిక్కులా బౌండరీల మోత మోగించాడు. 71వ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ అనంతరం కోహ్లీ చిందించిన చిరునవ్వు సగటు అభిమాని గుండెను తాకిందంటే అతిశయోక్తి కాదు. షాట్లలో ఎడ్జ్ లేదు. హిట్టింగ్‌కు తిరుగులేదు. బౌలర్లు ఎవరనే పని లేదు అనేలా సాగించిన ఈ ఇన్నింగ్స్ అద్భుత: ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్) కడవరకు క్రీజులో ఉండి.. జట్టు స్కోరు 212పరుగులు చేరుకునేలా ఆడాడు. ఇక తొలి ఓవర్లో ఎలాంటి ఉత్తేజంతో కన్పించాడో చివరి ఓవర్లోనూ అదే ఉత్తేజంతో కన్పించి ఫిట్ నెస్ కా బాప్ అనేదానికి మరోసారి నిదర్శనంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications