

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
తనకు అచ్చొచ్చిన ఈ మైదానంలోనే తన క్రికెట్ కెరీర్‌లోనే చిర్మస్మరణీయమైన పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.
తాజా సెంచరీ కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇది రెండోది కావడం గమనార్హం. విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు.
తాజా సెంచరీతో విండీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ(6) రికార్డు సృష్టించాడు. గిబ్స్, ఆమ్లా, డివిలియర్స్‌ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న కింగ్ కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.