
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ జట్టు ఆరు వన్డేల సిరీస్‌లో పాల్గొననుంది. మొదటి వన్డే ఫిబ్రవరి 1 గురువారం మొదలుకానుంది. భారత్ సిరీస్ మొదటి మ్యాచ్ నుంచే విజయ కాంక్షతో ప్రణాళికను సిద్ధం చేసింది.
దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత స్పిన్నర్లు తమ నైపుణ్యం ప్రదర్శించినా బ్యాట్స్‌మెన్లు చేసిన పొరబాట్లతో రెండు టెస్టుల్లో ఓడిపోయింది. చివరికి ఫేసర్లతోనే కోహ్లీ జట్టు గెలిచి చూపింది.
అయితే దక్షిణాఫ్రికా ఆటగాళ్ల తీరు తెలుసుకున్న కోహ్లీ సేన ఇప్పుడు స్పిన్నర్లను రంగంలోకి దింపే యోచనలో ఉంది. అదే గడ్డపై 2013లో సైతం ధోనీ అదే వ్యూహంతో మ్యాచ్‌ను గెలిచాడు.
మొదటి వన్డే గురించి స్పందించిన .. రోహిత్ శర్మ పర్యటనలో ముందు సఫారీ గడ్డపై అనుభవం లేకపోవటంతో భారత క్రికెటర్లు పరాజయం చెందారు. ఈ వన్డేకు ప్రాక్టీస్‌తో పాటుగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు.
ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే కేదర్ జాదవ్, కుల్‌దీప్ యాదవ్‍లతో కేవలం రిస్ట్ స్పిన్నర్లతో కొనసాగుతున్న ఏకైక జట్టు భారత్‌దే. అని కొనియాడాడు. ఇప్పటి వరకు అన్ని జట్లు లెగ్ స్పిన్నర్లు, ఆఫ్ స్పిన్నర్లు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.
భారత్‌కు బలమైన ప్రత్యర్థిగా ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా కూడా సిద్ధమైంది.