Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PHOTOS: భార్య అనుష్కతో కలిసి స్పోర్ట్స్ ఆనర్స్ ఫంక్షన్‌కు హాజరైన విరాట్ కోహ్లీ

Virat Kohli attends Indian Sports Honours annual ceremony with wife Anushka Sharma

హైదరాబాద్: సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియన్‌ స్పోర్టింగ్‌ ఆనర్‌ (ఐఎస్‌హెచ్) అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో ఈ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్‌ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. మొత్తం 17 క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను అనుష్క తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఫార్మల్ దుస్తుల్లో అనుష్క, కోహ్లీ

అనుష్క, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఫార్మల్ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ దుస్తుల్లో అనుష్క శర్మ చాలా అందంగా కనిపిస్తుండగా... విరాట్ కోహ్లీ తన బ్లాక్ సూట్‌‌లో మరింత కలగా ఉన్నాడు. దీంతో అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోలను కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే

నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ అవార్డులను ప్రదానం చేయాలనుకున్నా.. ఫుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. మొత్తం 11 కేటగిరీల్లో అవార్డులను ఐఎస్‌హెచ్‌ జ్యూరీ నిర్ణయించగా.. ఆరు పాపులర్‌ ఛాయిస్‌ అవార్డులకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేశారు.

జ్యూరీలో సభ్యులుగా

జ్యూరీలో సభ్యులుగా

ఐఎస్‌హెచ్‌ జ్యూరీలో సభ్యులుగా పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, సర్దార్ సింగ్, మహేశ్ భూపతి, పీటీ ఉష, అంజలి భాగవత్‌లు ఉన్నారు. ఆరు పాపులర్‌ ఛాయిస్‌ అవార్డు విభాగాలలో నామినేషన్లను స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జెఎఫ్ఐ) నుండి 200 మంది జర్నలిస్టులు షార్ట్ లిస్ట్ చేశారు.

యువరాజ్‌ సింగ్‌ దంపతులు సైతం

యువరాజ్‌ సింగ్‌ దంపతులు సైతం

ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి లెజెండరీ అథ్లెట్‌ మిల్కా సింగ్‌, కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌ దంపతులు, క్రీడాకారిణులు సానియా మీర్జా, దీపా కర్మాకర్‌, వినేశ్‌ ఫొగట్‌, మనూ భాకర్‌, స్మృతి మంథాన, జెమీమా రోడ్రిగ్స్‌, అజింక్యా రహానె, మహేశ్‌ భూపతి, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తదితరులు పాల్గొన్నారు.

Story first published: Saturday, September 28, 2019, 10:44 [IST]
Other articles published on Sep 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+