Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కలలు కనండి.. సాకారం చేసుకోండి: అథ్లెట్లతో కోహ్లీ

హైదరాబాద్: కలలు కనండి.. సాకారం చేసుకోండి ఈ మాట అన్నది ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తమ కలలపై దృఢ నమ్మకంతో ఉండాలని, వాటిని సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలని భారత అథ్లెట్లకు విరాట్‌ కోహ్లీ సూచించాడు.

49వ ఆలిండియా సెంట్రల్‌ రెవిన్యూ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ పూర్తి విశ్వాసముంటే అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికైనా సాధిస్తామన్నాడు.

ఇక్కడున్న వారికి నేను చెప్పేదొకటే

ఇక్కడున్న వారికి నేను చెప్పేదొకటే

‘ఒకవేళ నా మాటలు పనికొస్తాయనుకుంటే.. అథ్లెట్లందరికీ, ఇక్కడున్న వారికి నేను చెప్పేదొకటే. మీమీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరు. నేను ఇదే నినాదంతో జీవిస్తున్నా. అలాంటి భావనతోనే ప్రతీ రోజూ నడుస్తున్నా. ఏదైనా సాధించాలన్న ఆలోచన ఉంటే.. దాన్ని అందుకోగలమని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి' అని కోహ్లీ చెప్పాడు.

మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు

మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు

‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్ల సినిమా (దంగల్‌) చూశా. గుండెలను తాకింది. మొత్తం ఆరుగురు సోదరీమణులున్నా మీరిద్దరే (బబిత, గీత) సినిమాను నడిపించారు. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సాధించిపెట్టారు' అని కోహ్లీ అథ్లెట్లకు సూచించాడు.

 మీరు సాధించే విజయాలతో గర్వపడేలా చేయండి

మీరు సాధించే విజయాలతో గర్వపడేలా చేయండి

‘జీవితంలో, ఆటలో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలపండి. మీరు సాధించే విజయాలతో అందరూ గర్వపడేలా చేయండి. అందుకోసం నేను కూడా శక్తి మేరకు కృషి చేస్తాను' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కలలు కనండి.. సాకారం చేసుకోండి: అథ్లెట్లతో కోహ్లీ

కలలు కనండి.. సాకారం చేసుకోండి: అథ్లెట్లతో కోహ్లీ

రెజ్లర్‌ బబితా ఫోగట్, మహారాష్ట్ర మంత్రి వినోద్ తవాడే, గాయకుడు శంకర్‌ మహదేవన్‌‌లతో పాటు కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+