
హైదరాబాద్ : ఈ మధ్యనే పెళ్లి బంధంతో ఒకటైన విరాట్ కోహ్లీ అనుష్క శర్మల జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే సాధ్యమైనంత వరకు పరిచయస్థులందరికీ వాళ్లు బదులిస్తున్నారు. ఈ వరుసలో వస్తున్న శుభాకాంక్షలే కాదు. వాటితో పాటు వ్యంగ్యోక్తులు కూడా పేలుతున్నాయి.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి సహ ఆటగాడైన రోహిత్ శర్మ ట్వీట్ పంపాడు. రోహిత్ శర్మ 'విరుష్క జోడీకి శుభాకాంక్షలు. విరాట్ నీకు హస్‌బెండ్ హ్యాండ్ బుక్ షేర్ చేస్తా. అనుష్క.. నీ ఇంటి పేరును అలాగే ఉంచుకో'అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. దీనికి డిసెంబరు 19న స్పందించిన కోహ్లీ 'హా.. హా.. థ్యాంక్స్ రోహిత్. అలాగే డబుల్ హండ్రెడ్ హ్యాండ్ బుక్ కూడా నాకు షేర్ చెయ్యి' అని కోహ్లీ ఎన్ కౌంటర్ వేశాడు.
కోహ్లీ ఇప్పటి వరకు వన్డే మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా డబుల్ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. టెస్టుల్లో మాత్రం ఆరుసార్లు ద్విశతకాలు నమోదు చేశాడు. శ్రీలంకతో మొహాలీలో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ ద్విశతకం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ మాత్రం వన్డేల్లో మూడు సార్లు ద్విశతకాలు సాధించి రికార్డు సృష్టించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.