Bad to Worse: ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ సీజన్‌లో ఇప్పటికే కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో వరుస ఓటములు కోహ్లీ కెప్టెన్సీకే పరీక్షగా నిలుస్తున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆట పట్ల అతడు ఎంత అంకితభావం చూపిస్తున్నప్పటికీ ఓటములు అతడి కెప్టెన్సీపై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. గత పదకొండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. తాజా ఓటములతో ఆర్సీబీని విజేతగా నిలపాలన్న కోహ్లీ కల నెరవేరేలా కనిపించడం లేదు.

మార్చి 8 నుంచి వరుసగా 7 మ్యాచుల్లో ఓటమి
టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మార్చి 8 నుంచి వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలయ్యాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది.

ఆర్సీబీ 113 పరుగులకే ఆలౌట్
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 113 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ అత్యధిక పరుగులు (118) తేడాతో విజయం సాధించింది. ఇక, మంగళవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
తీవ్ర నిరాశలో ఆర్సీబీ అభిమానులు
దీంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శనపై అటు అభిమానులతో పాటు జట్టులోని ఆటగాళ్లు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24, 2019 నుంచి కెప్టెన్‌గా కోహ్లీ ప్రదర్శన చూస్తే చివరి రెండు టీ20ల్లో, చివరి మూడు వన్డేల్లో, ఐపీఎల్‌లో చివరి నాలుగు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది.

తదుపరి మ్యాచ్‌లో భారీ మార్పులు
గడిచిన పదకొండు సీజన్లలో బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో మరో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు గల్లంతే. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్‌లో భారీ మార్పులు ఉంటాయని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. "ఐపీఎల్ కేవలం నెలా.. నెలన్నర సమయంలో ముగిసే టోర్నీ. జట్టు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వరుస ఓటములపై మేమంతా కలిసి చర్చిస్తాం. కొత్త చర్యలైనా తీసుకుంటాం. కొత్త ఆటగాళ్లను జట్టులో తీసుకునే అవకాశాలున్నాయి. జట్టు కూర్పు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది. దీంతో రాబోయే మ్యాచ్‌లో జట్టులో మార్పులు ఉంటాయి" అని కోహ్లీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications