'ఎలాంటి ఇగో లేకుండా ధోని నుంచి కోహ్లీ సలహాలు'
హైదరాబాద్: మైదానంలో మాజీ కెప్టెన్ ధోని నుంచి సలహాలు తీసుకునేందుకు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఇగోని ప్రదర్శించబోడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు మైదానంలో వీరిద్దరూ ఎంతో కలుపుగోలుగా ఉంటారని అన్నాడు.

కోహ్లీకి విలువైన సలహాలు
కెప్టెన్సీకి ధోని వీడ్కోలు పలికినప్పటికీ మైదానంలో తన సూచనలను ఎప్పటికప్పుడు కోహ్లీకి తెలియజేస్తూనే ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ధోని సలహాలను తీసుకుంటూనే కోహ్లీ కూడా తనదైన శైలిలో జట్టుని ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జట్టుకు మంచి విజయాలు
ఈ ఇద్దరి కాంబినేషన్ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను సాధించిపెడుతుందోని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి జోడీ భారత్‌కు 2019 వరల్డ్ కప్ అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నాడు. కోహ్లీ దూకుడు, ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోందని లక్ష్మణ్ అన్నాడు.

కీపర్‌గా ఉండటం ధోనికి కలిసొచ్చే అంశం
వికెట్ కీపర్‌గా ఉండటం ధోనికి కలిసొచ్చే విషయమని లక్ష్మణ్ చెప్పాడు. 'కోహ్లీ కెప్టెన్ అయినప్పటి నుంచి వీరిద్దరి జోడీ అద్భుతాలు చేస్తోంది. కోహ్లీ, ధోనీ మధ్య ఈ బంధం బాగా బలపడింది. వికెట్ కీపర్‌గా స్టంప్స్ వెనుక ఉండటం వల్ల వివిధ కోణాల్లో ఫీల్డింగ్‌ను సెట్ చేసే అవకాశం ధోనికి ఉంది' అని లక్ష్మణ్ అన్నాడు.

కోహ్లీ ఎలాంటి ఇగోను ప్రదర్శించడం లేదు
ధోని నుంచి సూచనలు స్వీకరించేందుకు కోహ్లీ ఎలాంటి ఇగోను ప్రదర్శించడం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలిపాడు. 'ధోనికి జట్టులో ఎంతో గౌరవం ఉంది. అందుకే కోహ్లీ కూడా పూర్తిగా అతనిపై ఆధారపడుతున్నాడు. ధోని జట్టుకు మార్గదర్శి. ఇది కచ్చితంగా వరల్డ్‌కప్‌లో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది' అని లక్ష్మణ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications