Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన కోహ్లీ, అనుష్క

Virat Kohli, Anushka Sharma wish fans a happy and prosperous Diwali

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా "ఈ దీపావళి ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను'' అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనికి మూడు గంటల్లో దాదాపు 44వేలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.

మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి టీ20 ఆదివారం జరగనుంది. ఆఖరి టీ20కి చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Story first published: Thursday, November 8, 2018, 9:53 [IST]
Other articles published on Nov 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+