Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సినిమాకి బ్రేక్: కోహ్లీ కోసం అనుష్క 3రోజులు!

ముంబై: గత కొద్ది రోజులుగా దూరం దూరంగా ఉంటున్న ఆ ప్రేమ జంట మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

కాగా, అనుష్క శర్మను వీడి ఉండలేకపోతున్న విరాట్‌.. మళ్లీ ఆమెకు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడట. అనుష్క కూడా కోహ్లీ బాటలోనే నడుస్తున్నట్లుంది. అందుకే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్‌ను గెలిపించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపింది.

Virat Kohli, Anushka Sharma to patch up?

ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్న ఈ ఇద్దరూ త్వరలోనే రహస్యంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట. దీంతో తాను నటిస్తున్న 'సుల్తాన్' సినిమా షూటింగ్‌కు అనుష్క మూడు రోజుల విరామం ఇచ్చి మరీ కోహ్లీని కలవాలని నిర్ణయించుకుందట. ఆమె కోహ్లీతో విభేదాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ మొదలైన నేపథ్యంలో ఈ ప్రేమపక్షులు మళ్లీ దగ్గరవుతుండటం చర్చనీయాంశమైంది. ఇద్దరూ మళ్లీ ఒక్కటైతే.. అనుష్క టీమిండియా మ్యాచలకు హాజరవుతుందా..? కోహ్లీ మైదానం నుంచి మళ్లీ ఫ్లయింగ్‌ కిస్సులు ఇస్తాడా..? అనేది వేచి చూడాల్సిందే.

Virat Kohli, Anushka Sharma to patch up?

ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రత్యేక సందేశం పోస్ట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే దేశంలో అత్యాచారాలు, చిన్నారులపై వివక్ష ఎక్కువైన నేపథ్యంలో మహిళలపై తన గౌరవాన్ని చాటుకున్నాడు.

సమాజంలో సగటు మహిళకు ఎదురవుతున్న ఇబ్బందులపై క్షమాపణలు కోరాడు. మహిళలను సమాజం నుంచి దూరం చేయొద్దన్నాడు. అంతకుముందు తన తల్లితో తీసుకున్న సెల్ఫీని అప్‌లోడ్‌ చేసిన విరాట్‌ తన జీవితంలో ఆమే అత్యంత అందమైన మహిళ అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+