Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కోహ్లీ-అనుష్క రొమాన్స్ అదుర్స్ (వీడియో)

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించింది. ఈ విజయంలో ఆర్సీబీ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరుకుంది. ఇప్పుడు ఆర్సీబీ గురువారం క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేయడం ద్వారా జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. తర్వాత జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ మంచి పార్టనర్ షిప్‌తో జట్టును విజయపథంలో నడిపించారు.

లక్నోపై మ్యాచ్ గెలిచిన అనంతరం ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తోటీ ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అనుష్క శర్మ స్టాండ్స్ లో విజయాన్ని జరుపుతున్నారు. ఈ క్రమంలో గ్యాలరీలో కూర్చున్న తన సతీమణి అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ సైగలు చేస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. అనంతరం అనుష్క శర్మ స్పందించి ఫ్లయింగ్ కిస్ లతో బదులు ఇచ్చినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమ పక్షుల ఈ వీడియోను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. గ్రౌండ్ లో ఆటకంటే వీరిద్దరి మధ్య రొమాన్స్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఆర్సీబీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్1 లో తమ స్థానాన్ని నిర్ధారించుకుంది.

Virat Kohli-Anushka Sharma Steal the Show with Cute Romance After RCB s Victory

228 పరగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. దీని తర్వాత జితేష్ శర్మ(33 బంతుల్లో 85 పరుగులు,), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 పరుగులు) ఐదో వికెట్ కు 107 పరుగులు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 61 బంతుల్లో అజేయంగా 118 పరుగులు, మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు చేయడంతో 227 పరుగులు చేసిచంది.

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 54 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడతారు. ఆ సమయంలో ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.

Story first published: Wednesday, May 28, 2025, 11:30 [IST]
Other articles published on May 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+