Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Video: పెళ్లిరోజు కాదు.. వీధిలో వీరయ్య స్టైల్‌లో విరుష్క!

Virat Kohli-Anushka Sharma: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ ప్రస్తుతం లండన్‌లో తమ కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నారు. ఈ జంట లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఈ జంట లండన్ వీధుల్లో నడుస్తూ ఇద్దరు విదేశీయులతో మాట్లాడుతున్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. వారితో చాలాసేపు సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది.

లండన్‌ వీధుల్లో కోహ్లీ జంట
వైరల్ అవుతున్న ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చేతిలో గొడుగు, మరో చేతిలో వాటర్ బాటిల్‌తో కనిపిస్తున్నాడు. అనుష్క తన భుజానికి ఒక ఆకుపచ్చ రంగు హ్యాండ్ బ్యాగ్‌ను వేసుకుని ఉంది. ఈ వీడియో ద్వారా ఈ జంట తమ కూతురు వామిక, కొడుకు అకాయ్‌తో కలిసి విరామ సమయాన్ని గడుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆ వీడియోలో ఒక విదేశీ అబ్బాయి, అమ్మాయితో కోహ్లీ, అనుష్క మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య చాలా సేపు చర్చ జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. కోహ్లీ, అనుష్క ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.

Virat Kohli-Anushka Sharma Spotted Chatting on London Streets Video Goes Viral

అక్టోబర్‌లో తిరిగి రానున్న కింగ్ కోహ్లీ
ఐపీఎల్ 2025 తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో కనిపించలేదు. అయితే కొన్ని ఈవెంట్లలో ఆయన కనిపించినప్పుడు ఆయన లుక్ చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు తరఫున విరాట్ కోహ్లీ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తన తదుపరి వన్డే సిరీస్‌ను అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 19న జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Sunday, August 17, 2025, 18:29 [IST]
Other articles published on Aug 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+